వార్తలు

KIT KAT లో దూడ మాంసం

Nestlé కంపెనీ తనే స్వయంగా ఒప్పుకుంది, వాళ్ళ చాక్లెట్ KIT KAT లో దూడ మాంసమ యెుక్క రసం కలుపుతామని. మద్రాస్ High Court లో Fair and Lovely కంపెనీ మీద కేసువేసినపుడు, క్రీంలో పంది Grease తైలం కలుపుతామని స్వయంగా ఒప్పుకుంది. Vicks పేరున ఉన్న మందులను యూరోప్ లోని అనేక దేశాలలో BAN చేశారు, అక్కడ దీనిని విషంగా ప్రకటించారని. కానీ భారతదేశం లో రోజంతా TV లో దీనిప్రకటన వస్తుంది. LIFEBUOY […]

రాజకీయం

లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులపై ఆదాయపు పన్నుశాఖ కొరడా

బినామీ లావాదేవీల వ్యవహారానికి సంబంధించి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులపై ఆదాయపు పన్ను శాఖ కొరడా ఝుళిపించింది. రూ. 170 కోట్లకు పైగా విలువైన 12 స్థిరాస్తులను జప్తు చేసింది. ఈమేరకు లాలూ భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాదవ్ తో పాటు ఇతర కుటుంబ సబ్యులకు నోటీసులిచ్చింది. రూ. వెయ్యి కోట్ల భూ లావాదేవీలు, పన్ను ఎగవేత కేసును దర్యాప్తు చేస్తున్న ఐటీ శాఖ – వీరంతా బినామీ ఆస్తులతో […]

సినిమా

వెండితెరపై కనిపించనున్న..సానియా మీర్జా

భారత అగ్రశ్రేణి టెన్నిస్‌ తార సానియా మీర్జా త్వరలో వెండితెరపై కనిపించనున్నట్లు సమాచారం. బాలీవుడ్‌ దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌ ఇందుకు సంబంధించిన చిన్న క్లూను ఇవ్వడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది.ఫాదర్స్‌ డే సందర్భాన్ని పురస్కరించుకుని దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌తో సానియామీర్జా తన తండ్రితో ఉన్న ఫొటోను పంచుకుంది. దీనిపై స్పందించిన ఫర్హాన్‌ అక్తర్‌ సానియాకు ధన్యవాదాలు తెలుపుతూ… ఒక ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ కారణంగానే సానియా వెండితెరపై మెరవనుందా అని అనుమానాలు వ్యక్తం […]

స్పోర్ట్స్

ఆటగాడిగా అనిల్‌ కుంబ్లేది 17 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం

అంతర్జాతీయ క్రికెట్లో ఆటగాడిగా అనిల్‌ కుంబ్లేది 17 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం. ఏడాది కిందట టీమ్‌ఇండియా కోచ్‌గా ఎంపికైనపుడు ఆ పదవిలోనూ దీర్ఘ కాలం కొనసాగుతాడనే అనుకున్నారు.. కానీ కుంబ్లే ఏడాదికే నిష్క్రమించాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీతో తన ఏడాది పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో.. అంతటితోనే తన ప్రస్థానాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు. వెస్టిండీస్‌ పర్యటనకూ కోచ్‌గా కొనసాగాలని బోర్డు కోరినా, కోచ్‌ పదవికి మళ్లీ రేసులో నిలిచే అవకాశం ఉన్నా.. కుంబ్లే మాత్రం తక్షణం కోచ్‌గా తప్పుకోవాలని […]

స్పెషల్ స్టోరీస్

యోగా ప్రపంచానికి గొప్ప వరమన్నా చంద్రబాబు

యోగా ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలతో కలిసి యోగసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘యోగాతో ప్రపంచంలో ఏదైనా సాధించగలం. యోగా ఒక్కప్పుడు భారత్‌కే పరిమితం.. మోదీ ప్రధాని అయ్యాక యోగాపై ఐరాసలో ప్రతిపాదన ఇచ్చారు. ప్రపంచం మొత్తం పాటిస్తే మానవాళికి ఉపయోగపడుతుందని వివరించారు. ఐరాస పిలుపు మేరకు 177 దేశాల్లో యోగా జరుపుకుంటున్నారు. […]

ఇంటర్వూస్

ఉగ్రవాద స్థావరాలపై దాడులు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ యంత్రాంగం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. పాక్‌ పొరుగుదేశం అఫ్గానిస్తాన్‌లోనూ ఉగ్రవాదుల స్థావరాలపై దాడులను అమెరికా తీవ్రతరం చేయనుంది. ట్రంప్‌ యంత్రాంగంలోని అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం… డ్రోన్‌ దాడులను విస్తృతం చేయడం, పాక్‌కు ఇస్తున్న నిధుల్లో కోత విధించడం లేదా వాటిని మళ్లించడం, నాటోయేతర మిత్రదేశంగా పాక్‌కు ఉన్న హోదాను తగ్గించడం తదితర చర్యలకు ట్రంప్‌ యంత్రాంగం సిద్ధమవుతోంది. అయితే పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు అమెరికా […]