Home స్పెషల్ స్టోరీస్ ప్రతిభకు పేదరికం అడ్డుకాదు…

ప్రతిభకు పేదరికం అడ్డుకాదు…

0

నల్లగొండ జిల్లా: కేతేపల్లి గ్రామపంచాయతీ చీకటిగూడెం గ్రామానికి చెందిన వడ్డె నవ్య ప్రభుత్వ ప్రోత్సాహం లేకుండానే పట్టుదలతో సాధన చేస్తూ, పీఈటీ ఉపాధ్యాయుడు చెప్పిన మెళకువలు పాటిస్తూ పాఠశాల స్థాయిలో అంచెలంచెలుగా దేశ, || ప్రపంచ దేశాల పోటీలలో పాల్గొనే స్థాయికి ఎదిగి దేశం గర్వించేలా ప్రతిభ కనబరిచింది. || నవ్య తల్లిదండ్రులు వడ్డె మోహన్‌రావు, నీలమ్మ. తమకున్న ఏకురంన్నర పొలాన్ని సాగుచేసుకుంటూ నవ్యను ప్రభుత్వపాఠశాలలో పదవతరగతి వరకు చదివించారు. || ఇంటర్ శ్రీనిధి జూనియర్ కాలేజీ సూర్యాపేటలో పూర్తిచేసింది. || ప్రస్తుతం అక్కడే డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నారు. || చదువులో, ఆటల్లో చురుగ్గా ఉండే నవ్యలోని ప్రతిభను స్కూలు పీఈటీ ఉపాధ్యాయుడు హనుమంతరావు గుర్తించాడు. || అప్పటి నుంచి ప్రతిరోజు ఉదయం 7గంటల నుంచి 9 వరకు, మధ్యాహ్నం 3.30 నుంచి 5 గంటల వరకు నవ్యతో సాధన చేయిస్తూ, అనేక పోటీల్లో భాగస్వామురాలిని చేశాడు. || కఠోర శ్రమకు ఫలితంగా థాయిలాండ్‌లోని పతయా నగరంలో అంతర్జాతీయ ఆఫ్ మారతాన్ పరుగు పందెం పోటీలలో భారతదేశం తరుపున 21 కిలోమీటర్ల పరుగు పందెంలో పాల్గొని ద్వితీయ స్థానం సాధించింది. || క్రీడలు ముగించుకొని స్వగ్రామానికి తిరిగొచ్చిన సందర్భంగా నవ్యకు చీకటిగూడెం గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ, ఉద్యోగ సంఘాల కమిటీ, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. పాఠశాలలో సన్మాన కార్యక్రమం నిర్వహించి పూలమాలలతో సత్కరించారు.

గోల్డ్ మెడల్ లక్ష్యంగా…
ప్రభుత్వం సహకారం అందిస్తే ఆసియన్, కామన్‌వెల్త్ ప్రపంచ స్థాయి పరుగు పందెం పోటీలలో గోల్డ్ మెడల్ సాధిస్తానంటుంది నవ్య. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 27పోటీలలో పాల్గొని 15 మెడల్స్ సాధించింది. || అందులో రెండు గోల్డ్‌మెడల్స్, రెండు కాంస్యం ఉన్నాయి. || మొదటి నుంచి షూ లేకుండా సాధన చేశానని, మారతాన్ క్రీడల స్థాయిలో తగ్గట్టుగా షూ లేకపోవడం, ఆర్థిక ఇబ్బందుల వల్ల కొనలేకపోవడం బాధాకరం.

ఫౌండేషన్ సహకారంతో మారథాన్ పోటీలకు…
బ్యాంకాక్‌లో నిర్వహించిన మారన్ పోటీలకు యునైటెడ్ పింక్ సిస్టర్ ఫౌండేషన్ సహకారంతో పరుగు పందెం పోటీలకు వెళ్లింది. || ఈ పోటీలో పాల్గొనేందుకు శక్తివంతంగా ఉండేందుకు కావాల్సిన పౌష్టికాహారం కూడా తీసుకోలేకపోయింది. || అలాంటి ఆహారం ఉన్నట్లయితే ఎక్కువ దూరం పరుగెత్తే సామర్థం సమకూదేది అంటుంది నవ్య.

ప్రతిభను గుర్తించా : పిఇటి, హనుమంతరావు…
వడ్డె నవ్య పరుగుపందెం పోటీలో ప్రతిభను గుర్తించి ప్రతి రోజు శిక్షణను ఇవ్వడం వల్లే ప్రపంచ స్థాయికి ఎదిగింది. || ప్రతి రోజు ఉదయం ఇంటికి వెళ్లి నవ్యను తీసుకొని పాఠశాలకు వెళ్లి పాఠశాల ప్రారంభమయ్యేంత వరకు శిక్షణ ఇచ్చాను.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *