Home News9TVAdmin

News9TVAdmin

నిమజ్జన వివాదం: సుప్రీంకు మమతా సర్కార్‌..?

కోల్‌కతాః మొహరం సందర్భంగా అక్టోబర్‌ 1న దుర్గా మాత విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి కలకత్తా హైకోర్టు  ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని భావిస్తున్నారు. దుర్గా విగ్రహాల నిమజ్జనాలను అక్టోబర్‌ 1న నిషేధిస్తూ మమతా సర్కార్‌ జారీ చేసిన నోటిఫికేషన్‌ను కలకత్తా హైకోర్టు కొట్టివేసిన విషయం విదితమే.మొహరం, విజయదశమి ఒకేసారి రావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగే అవకాశం ఉందని ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ఇచ్చిన వివరణతో […]

‘గాంధీ, నెహ్రూ, అంబేద్కర్‌లు ఎన్నారైలు’

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ భారత స్థాతంత్ర్య ప్రముఖ ఉద్యమకారులను ఎన్నారైలు అని సంబోధించారు. అలాగే, స్వాతంత్ర్య ఉద్యమాన్ని కూడా ఎన్నారై ఉద్యమం అని అభివర్ణించారు. ఎన్నారై ఉద్యమంలో భాగంగానే తమ కాంగ్రెస్‌ పార్టీ పుట్టిందని చెప్పారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ విదేశాల్లోని కాంగ్రెస్‌ మద్దతుదారులతో భేటీ అవుతూ సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా గురువారం న్యూయార్క్‌లో దాదాపు 2000 మంది కాంగ్రెస్‌ […]

ఈసారి కూడా ధోనికి నిరాశేనా?

న్యూఢిల్లీ: భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడైన మహేంద్ర సింగ్ ధోని పేరును దేశ మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ అవార్డుకు బీసీసీఐ సిఫారుసు చేసిన సంగతి తెలిసిందే. అయితే ధోనికి పద్మభూషణ్ పురస్కారం లభించే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. ఈ అవార్డుకు ధోని పేరును మాత్రమే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సిఫారుసు చేసినా ఉపయోగంలేనట్లే కనబడుతోంది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం ధోని పేరును ప్రభుత్వం మరోసారి తిరస్కరించినట్లు తెలుస్తోంది. […]

‘జై లవకుశ’ అద్భుతమైన ఓపెనింగ్స్‌

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేసిన ‘జై లవకుశ’ చిత్రం బాక్సాఫీసు వద్ద సందడి చేస్తోంది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రముఖుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కాగా ఈ చిత్రం అమెరికా బాక్సాఫీసు వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్‌ రాబట్టినట్లు సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. యూఎస్‌ఏ బాక్సాఫీసు వద్ద 18వ స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. బుధవారం 168 లొకేషన్లలో ప్రదర్శించిన (ప్రీమియర్‌ షోలు) ఈ చిత్రం 560,699 డాలర్లు (రూ. 3.64 […]

నా ఫుల్‌ సపోర్ట్‌ మోదీకే: రజనీ కాంత్‌

న్యూ ఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం తలపెట్టిన ‘స్వచ్చతా హీ సేవా’  కార్యక్రమంలో భాగం కావాలని రాజకీయ, సినిమా, బిజినెస్‌ ఇలా ఉన్నత స్థానంలో ఉన్న ప్రముఖులకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. లేఖలో మీకున్న ప్రజాదరణతో అందరిలో చైతన్యం తీసుకురావాలని కోరారు. ఇందులో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూడా ఉన్నారు. మోదీ లేఖకు రజనీకాంత్‌ వెంటనే స్పందించారు. మీరు తలపెట్టిన స్వచ్చతా హీ సేవా కార్యక్రమానికి నా పూర్తి మద్దతు ఉంటుందని మోదీని ట్యాగ్‌ చేస్తూ […]

నాలుగు గంటల్లో.. సౌత్ హీరో ప్రపంచ రికార్డ్

సౌత్ సినిమా హాలీవుడ్ కు కూడా షాక్ ఇస్తోంది. ఇప్పటికే అత్యధిక లైక్ లు సాధించిన టీజర్ గా స్టార్ వార్స్ పేరిట ఉన్న రికార్డ్ ను అజిత్ హీరోగా తెరకెక్కిన వివేగం టీజర్ చెరిపేసింది. అయితే అజిత్ అభిమానులకు ఆ ఆనందం ఎన్నో రోజులు మిగలలేదు. తాజాగా వివేగం రికార్డ్ ను విజయ్ హీరోగా తెరకెక్కిన మెర్సల్ చెరిపేసింది. ఈ సినిమా టీజర్ కు కేవలం నాలుగు గంటల్లోనే 6 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. […]

నల్లగొండ ఉప ఎన్నికలో బీజేపీ పోటీ: లక్ష్మణ్‌

సిద్దిపేట: నల్లగొండ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ప్రక టించారు. గురువారం సిద్దిపేటలో ఆయన విలేక రులతో మాట్లాడారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళుతామని, అందుకు నల్లగొండ ఉప ఎన్నికను వినియోగించుకుంటామన్నారు. ప్రధా ని మోదీ అవినీతి రహిత పాలనకు తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నార న్నారు. నల్లగొండ ఒక్కచోటనే ఉప ఎన్నిక నిర్వ హించడం సరికాదని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే […]

పాకిస్థాన్‌.. ఇప్పుడు టెర్రరిస్థాన్‌ ఐరాసలో పాక్‌కు దీటుగా బదులిచ్చిన భారత్‌

యునైటెడ్‌ నేషన్స్‌: తమ దేశానికి భయపడి భారత్‌ కశ్మీర్‌ ప్రజలను అణిచివేసే ప్రయత్నం చేస్తోందని ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశంలోపాక్‌ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు భారత్‌ దీటుగా బదులిచ్చింది. పాకిస్థాన్‌ ఇప్పుడు ఒక టెర్రరిస్థాన్‌ అని.. ఆ దేశం ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారుతోందని ఐరాసలోని భారత తొలి సెక్రటరీ ఈనమ్‌ గంబీర్‌ అన్నారు. ‘గత కొన్నేళ్ల చరిత్రను చూసినట్లయితే పాకిస్థాన్‌ అంటే ఉగ్రవాదం అన్నట్లు కన్పిస్తోంది. పాకిస్థాన్‌ అంటే అర్థం స్వచ్ఛమైన భూమి. ఇప్పుడా స్వచ్ఛమైన భూమి కాస్తా […]

ప్రపంచపు అత్యంత ధనిక మహిళ మృతి

ప్రపంచంలో అత్యంత ధనిక మహిళ లిలియానే బెటెన్‌కోర్టు(94) కన్నుమూశారు. గురువారం ఆమె తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రపంచంలో ప్రముఖ కాస్మోటిక్‌ కంపెనీ లోరియల్‌కు ఆమె వారసురాలు. కంపెనీ వ్యవస్థాపకుడు యూజీన్ షుల్లెర్‌కు బెటెన్‌కోర్టు కూతురు. ఫోర్బ్స్‌, బ్లూమ్‌బర్గ్‌ బిలినీయర్‌ ఇండెక్స్‌లలో బెటెన్‌కోర్టు ప్రపంచంలో అత్యంత ధనిక మహిళగా పేరు దక్కించుకున్నారు. ఆమె నికర సంపద సుమారు 44 బిలియన్‌ డాలర్లు ఉంటుంది. అంటే మన దేశీయ కరెన్సీ ప్రకారం రూ.2,85,980 కోట్లకు పైననే. ప్రస్తుతం బెటెన్‌కోర్టు […]

‘జైలవకుశ’పై టీడీపీ శ్రేణుల దుష్ప్రచారం

నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌పై తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరోసారి దుష్ప్రచారనికి తెగబడ్డాయా?. గతంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన సినిమాలు విడుదలైన సందర్భంలో చేసినట్లుగానే తాజాగా ‘జై లవ కుశ’ చిత్రం విషయంలోనూ ప్రతికూల ప్రచారాన్ని మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఆయా సోషల్‌మీడియా వేదికల్లో ఈ సినిమాపై జరుగుతున్న ప్రచారం ఆ విషయాన్నే నిర్థారిస్తోంది. నందమూరి తారక రామారావు (జూనియర్‌ ఎన్టీఆర్‌) నటించిన ఈ చిత్రం గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పలు చోట్ల సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ […]