Home News9TVAdmin

News9TVAdmin

నేలపై కూర్చుంటాను. ప్రత్యేక ఏర్పాట్లొద్దు: సీఎం

నేలపై కూర్చుంటాను. ప్రత్యేక ఏర్పాట్లొద్దు: సీఎం లక్నో: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేరుకు యోగి అయినా విలాసవంతంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అమరుడైన ఓ బీఎస్‌ఎఫ్‌ జవాను కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం యోగి వెళ్లిన సందర్భంగా ఆయన ఇంటిలో ఏసీ, సోఫా, కార్పెట్‌లను అధికారులు ఏర్పాటు చేయడం విమర్శలకు తావిచ్చింది. వారి ఇంటి నుంచి సీఎం యోగి వెళ్లిపోగానే వాటిని అధికారులు తొలగించి, తమతోపాటు తీసుకెళ్లారు. సీఎం యోగి ఎక్కడికి వెళ్లినా ఇదేవిధంగా అధికారులు […]

బాబు దీక్ష అట్టర్‌ ఫ్లాప్‌: సీపీఐ నేత రామకృష్ణ

బాబు దీక్ష అట్టర్‌ ఫ్లాప్‌: సీపీఐ నేత రామకృష్ణ సాక్షి, హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడలో చేపట్టిన నవనిర్మాణ దీక్షకు 10 వేల కుర్చీలు ఏర్పాటు చేస్తే కనీసం 2 వేల కుర్చీలు కూడా నిండలేదని..మొత్తంగా ఈ దీక్ష అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందని ఏపీ సీపీఐ కార్యదర్శి కె. రామకృష్ణ విమర్శించారు. చంద్రబాబు తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. శనివారం మగ్దూంభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేకహోదా సాధనతో పాటు విభజన […]

లండన్‌లో ఉగ్రదాడులు

లండన్‌లో ఉగ్రదాడులు లండన్‌: బ్రిటన్‌ రాజధాని లండన్‌పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున బరౌ మార్కెట్‌కు చేరువలోని బ్రిడ్జిపై నడుస్తున్న వారిపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొద్ది సేపటికే ఆయుధాలతో మార్కెట్‌లోకి వచ్చిన ఉగ్రవాదులు కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిపై కత్తులతో దాడి చేశారు. ఓ బాలికను 15 నుంచి 20 సార్లు కత్తితో పొడుస్తూ అల్లా కోసం ఈ దాడి అంటూ అరిచారు. […]

ఇక యుద్ధ క్షేత్రంలో భారత నారీమణులు

ఇక యుద్ధ క్షేత్రంలో భారత నారీమణులు భారత​ ఆర్మీలో మార్పులు జరగనున్నాయి. ఇప్పటి వరకు యుద్ధ క్షేత్రంలో పోరాడేవారిగా కేవలం పురుషులు మాత్రమే కనిపించగా మున్ముందు మహిళలు కూడా పాలుపంచుకోనున్నారు. వారు నారీమణులుగా అవతారం ఎత్తనున్నారు. ఈ మేరకు కావాల్సిన అన్ని రకాల మార్పులు సిద్ధం చేస్తున్నట్లు భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ చెప్పారు. ‘మహిళలు జవాన్లు రావడం అనే అంశాన్ని నేను పరిశీలిస్తున్నాను. త్వరలోనే నేను ఆ ప్రక్రియను ప్రారంభిస్తాను. తొలుత మిలిటరీ పోలీసు […]

పాక్‌పై గెలిస్తే.. ఆ నదిలో మునిగినట్టే!

పాక్‌పై గెలిస్తే.. ఆ నదిలో మునిగినట్టే! అమృత్‌సర్‌: భారత మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ చాంపియన్స్‌ ట్రోఫీలో దాయాదుల సంగ్రామంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియాకు శుభాశీస్సులు అందజేసిన ఆయన.. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను కనుక ఓడిస్తే.. అది టీమిండియాకు గొప్ప గౌరవమవుతుందని, పవిత్ర గంగానదిలో మునిగినంతా పుణ్యం కలుగుతుందని చమత్కరించారు. ‘పాకిస్థాన్‌పై విజయం సాధించడం నిజంగా గొప్ప గౌరవం. పాకిస్థాన్‌తో క్రికెట్‌ మ్యాచ్‌లో గెలిస్తే గంగానదిలో మునిగి […]