Home Prasanthi Kumari

Prasanthi Kumari

GST వల్ల ఉపయోగాలు మరియు వాస్తవాలు

GST విషయంలో మనం అనవసర ఆందోళన లేకుండా అసలు వాస్తవాలు తెలుసుకుని, అన్ని అపోహలు తొలగించుకొని, సంతోషంగా స్వాగతం పలికి దేశాభివృద్ధిలో నూతన అధ్యయనానికి నాంది పలుకుదాం. 🔶 #GST వలన అంతిమ లబ్ది పొందేది వ్యాపారవేత్తలు మరియు వినియోగదారులు. 🔶GST అమలు వలన ప్రభుత్వానికి పన్ను రాబడి తగ్గుతుంది అంటే ఆ మేరకు మనం లాభపడతాం. 🔶 సర్వీస్ టాక్స్ విలువ పెరిగినట్లు కనపడినా మొత్తం బిల్లుల విలువ తగ్గడం వలన అది ఏ విధంగానూ […]

ఉాపిరి పిల్చుకోండి నిజాలు చెప్పే యువత సోషల్ మీడియాలో పోస్టులకు నో అరెస్టు… సుప్రీంకోర్టు సంచలన తీర్పు

తమకు అనుకూలమైన రాతలను చూసి ఆనందిస్తూ, వ్యతిరేకమైన రాతలను అణచివేస్తూ అరెస్టుల పర్వాన్ని సాగిస్తున్న ప్రభుత్వాలకు చెంపపెట్టు తగిలింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ – 2000 చట్టంలోని సెక్షన్-66Aను కొట్టేస్తూ మంగళవారం (జూన్ 27) సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐటీ యాక్ట్ – 2000లోని సెక్షన్-66A అనేది ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా ఉందని.. జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు సందర్భంగా పేర్కొంది. పౌరుల భావ వ్యక్తీకరణ […]

ప్లాస్టిక్ రైస్ – మీడియా అత్యుత్సాహం

ఎప్పుడూ లాగానే కేవలం సెన్సేషన్ కోసం తప్ప నిజాలతో పనిలేకుండా పనిచేసే మీడియా ప్లాస్టిక్ రైస్ విషయంలో కూడా అలాగే ప్రవర్తించింది. కనీస హేతుబద్ధ విశ్లేషణ చెయ్యకుండా ‘ప్లాస్టిక్ రైస్, ప్లాస్టిక్ రైస్’ అంటూ ఊదరగొట్టి ప్రజలను భయకంపితులను చేసింది. ప్లాస్టిక్ రైస్ సాధ్యాసాధ్యాలను ఒకసారి హేతుబద్దంగా పరిశీలిస్తే..     1) ఫిజిక్స్ : బియ్యం సాంద్రత ప్లాస్టిక్ కన్నా ఎక్కువ అందువల్ల ఒక కిలో బియ్యం సైజు కన్నా ఒక కిలో ప్లాస్టిక్ సైజు […]

మద్యం మత్తులో మొసలితో సంపర్కాన్ని కోరుకుని ప్రాణాలు పోగొట్టుకున యువకుడు

మత్తు పాదార్థాలు స్వీకరించిన ఒక వ్యక్తి అమానుషంగా ప్రవర్తించాడు. మద్యం, పొగ, మత్తుపదార్థాలు సేవించడం వల్ల ఆరోగ్యమే కాకుండా ఆలోచన విధానం కూడా మారిపోతుంది. అలాగే విచక్షణ కోల్పోయి ఎప్పుడు ప్రశాంతంగా ఉండే మనసును మార్చేసి, ఎదుటివారి వినాశనానికో లేద తన నాశనానికో దారి తీస్తుంది. ఇలా మద్యం మత్తులో విచక్షణ రహితంగా ప్రవర్తించి ఒక వ్యక్తి ఏకంగా మొసలితో సంపర్కాన్ని కోరుకుని తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని ఓ 26 ఏళ్ల యువకుడు […]

ఉగ్రవాద స్థావరాలపై దాడులు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ యంత్రాంగం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. పాక్‌ పొరుగుదేశం అఫ్గానిస్తాన్‌లోనూ ఉగ్రవాదుల స్థావరాలపై దాడులను అమెరికా తీవ్రతరం చేయనుంది. ట్రంప్‌ యంత్రాంగంలోని అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం… డ్రోన్‌ దాడులను విస్తృతం చేయడం, పాక్‌కు ఇస్తున్న నిధుల్లో కోత విధించడం లేదా వాటిని మళ్లించడం, నాటోయేతర మిత్రదేశంగా పాక్‌కు ఉన్న హోదాను తగ్గించడం తదితర చర్యలకు ట్రంప్‌ యంత్రాంగం సిద్ధమవుతోంది. అయితే పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు అమెరికా […]

యోగా ప్రపంచానికి గొప్ప వరమన్నా చంద్రబాబు

యోగా ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలతో కలిసి యోగసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘యోగాతో ప్రపంచంలో ఏదైనా సాధించగలం. యోగా ఒక్కప్పుడు భారత్‌కే పరిమితం.. మోదీ ప్రధాని అయ్యాక యోగాపై ఐరాసలో ప్రతిపాదన ఇచ్చారు. ప్రపంచం మొత్తం పాటిస్తే మానవాళికి ఉపయోగపడుతుందని వివరించారు. ఐరాస పిలుపు మేరకు 177 దేశాల్లో యోగా జరుపుకుంటున్నారు. […]

ఇద్దరు ఉగ్రవాదులపై కాల్పులు

జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఓ ఇంట్లో దాగి ఉన్న ముష్కరులపై కాల్పులు జరిపి హతమార్చినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. బారాముల్లాలోని రఫియాబాద్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనేసమాచారం రావడంతో పోలీసులు, భద్రతాసిబ్బంది సంయుక్తంగా నిన్న రాత్రి నుంచి కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఆ ప్రాంతమంతా ముమ్మర తనిఖీలు చేపట్టారు. పజల్‌పొరా గ్రామంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారని గుర్తించిన భద్రతాసిబ్బంది ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో ముష్కరులు జవాన్లపైకి కాల్పులు […]

ఆటగాడిగా అనిల్‌ కుంబ్లేది 17 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం

అంతర్జాతీయ క్రికెట్లో ఆటగాడిగా అనిల్‌ కుంబ్లేది 17 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం. ఏడాది కిందట టీమ్‌ఇండియా కోచ్‌గా ఎంపికైనపుడు ఆ పదవిలోనూ దీర్ఘ కాలం కొనసాగుతాడనే అనుకున్నారు.. కానీ కుంబ్లే ఏడాదికే నిష్క్రమించాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీతో తన ఏడాది పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో.. అంతటితోనే తన ప్రస్థానాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు. వెస్టిండీస్‌ పర్యటనకూ కోచ్‌గా కొనసాగాలని బోర్డు కోరినా, కోచ్‌ పదవికి మళ్లీ రేసులో నిలిచే అవకాశం ఉన్నా.. కుంబ్లే మాత్రం తక్షణం కోచ్‌గా తప్పుకోవాలని […]

లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులపై ఆదాయపు పన్నుశాఖ కొరడా

బినామీ లావాదేవీల వ్యవహారానికి సంబంధించి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులపై ఆదాయపు పన్ను శాఖ కొరడా ఝుళిపించింది. రూ. 170 కోట్లకు పైగా విలువైన 12 స్థిరాస్తులను జప్తు చేసింది. ఈమేరకు లాలూ భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాదవ్ తో పాటు ఇతర కుటుంబ సబ్యులకు నోటీసులిచ్చింది. రూ. వెయ్యి కోట్ల భూ లావాదేవీలు, పన్ను ఎగవేత కేసును దర్యాప్తు చేస్తున్న ఐటీ శాఖ – వీరంతా బినామీ ఆస్తులతో […]

వెండితెరపై కనిపించనున్న..సానియా మీర్జా

భారత అగ్రశ్రేణి టెన్నిస్‌ తార సానియా మీర్జా త్వరలో వెండితెరపై కనిపించనున్నట్లు సమాచారం. బాలీవుడ్‌ దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌ ఇందుకు సంబంధించిన చిన్న క్లూను ఇవ్వడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది.ఫాదర్స్‌ డే సందర్భాన్ని పురస్కరించుకుని దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌తో సానియామీర్జా తన తండ్రితో ఉన్న ఫొటోను పంచుకుంది. దీనిపై స్పందించిన ఫర్హాన్‌ అక్తర్‌ సానియాకు ధన్యవాదాలు తెలుపుతూ… ఒక ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ కారణంగానే సానియా వెండితెరపై మెరవనుందా అని అనుమానాలు వ్యక్తం […]