Home Prasanthi Kumari

Prasanthi Kumari

ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసుల దస్త్రంపై ప్రధాని సంతకం

ఉపాధ్యాయులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఏకీకృత సర్వీసుల దస్త్రంపై ప్రధాని సంతకం చేశారు. మంగళవారం లఖ్‌నవూ పర్యటనకు వెళ్లేముందు ప్రధాని నరేంద్రమోదీ ఈ ఫైలుపై సంతకం చేసి రాష్ట్రపతి భవన్‌కు పంపారు. ఇక రాష్ట్రపతి ఆమోదముద్ర పడిన వెంటనే ఇదివరకున్న ఉత్తర్వులను సవరిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు గత కొన్నిరోజులుగా ఈ అంశంపై దృష్టిసారించడంతో దస్త్రం చకచకా పరుగులు తీసింది. ఈనెల 14న ఆయన హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ని కలిసి సమస్య తీవ్రతను వివరించారు. తెలుగు […]

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో మోదీ

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలోని రమాబాయ్‌ అంబేద్కర్‌ మైదానంలో నిర్వహించిన యోగా వేడుకల్లో మోదీ పాల్గొన్నారు. వేల సంఖ్యలో తరలివచ్చిన ఔత్సాహికులతో కలిసి మోదీ యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. యోగా ద్వారానే శారీరక, మానసిక వికాసం సాధ్యమవుతుందని అన్నారు. యోగాతో పైసా ఖర్చు లేకుండా సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చునని, యోగా.. సాధన రుషులు, మహర్షుల నుంచి సామాన్యుల […]

‘ఇప్పటికైనా మా దేశానికి వచ్చి ఆడండి’

‘ఈ రోజు పాకిస్థాన్‌ చరిత్రలో చాలా సంవత్సరాలపాటు గుర్తుండిపోతుంది’ అంటూ పాకిస్థాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ హర్షాన్ని వ్యక్తం చేశాడు. చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్‌పై విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకున్న అనంతరం అతను మీడియాతో మాట్లాడాడు. ఇకనైనా పాకిస్థాన్‌లో క్రికెట్‌ ఆడేందుకు ఇతర దేశాలు ముందుకురావాలని అతను విజ్ఞప్తి చేశాడు. 2009లో లాహోర్‌లో శ్రీలంక జట్టుపై ఉగ్రవాద దాడి అనంతరం ఓ పెద్ద క్రికెట్‌ జట్టు కూడా పాకిస్థాన్‌లో ఆడేందుకు ముందుకు […]