Home వార్తలు

వార్తలు

వాడవాడలా బతుకమ్మ వేడుకలు

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటే బతుకమ్మ పండగ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఘనంగా ఆరంభమయ్యాయి. మంత్రుల సతీమణులు మొదలుకొని రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొన్నారు. వాడవాడలా ఆటపాటలతో వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల్లో తొలిరోజు పండగను ఎంగిలిపూల బతుకమ్మగా పిలుస్తారు. ఎంగిలిపూల బతుకమ్మల సందడి ఉదయం నుంచి ప్రారంభమైంది. తీరొక్క పూలను సేకరించి తెచ్చి మహిళలు గౌరమ్మను పూజించి బతుకమ్మలను పేర్చారు. అనంతరం వారు […]

ఆ బ్యాంకుల చెక్కులు చెల్లవు: ఎస్బీఐ

ఆ బ్యాంకుల చెక్కులు చెల్లవు: ఎస్బీఐ

దిల్లీ: ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తమ ఖాతాదారులకు కీలక సూచన చేసింది. ఇటీవల ఎస్బీఐలో విలీనమైన ఆరు బ్యాంకులకు చెందిన పాత చెక్‌బుక్‌లు, ఐఎఫ్‌ఎస్‌ కోడ్‌లు సెప్టెంబర్‌ 30 నుంచి చెల్లబోవని తెలిపింది. సదరు బ్యాంకు ఖాతాదారులు వెంటనే కొత్త చెక్‌బుక్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ఈ ఏడాది ఆరంభంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా, […]

వాడవాడలా బతుకమ్మ వేడుకలు

కాఫీడే యజమాని ఇళ్లపై ఐటీదాడులు

బెంగళూరు: కాఫీడే కంపెనీ యజమాని వీజీ సిద్ధార్థ ఇళ్లపై ఐటీశాఖ దాడులు చేపట్టింది. ఐటీ శాఖ ఏకకాలంలో 20 చోట్ల తనిఖీలు మొదలుపెట్టింది. వీటిల్లో ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లోని ఆయన ఇళ్లు కూడా ఉన్నాయి. వీజీ సిద్ధార్థ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అల్లుడు. సిద్ధార్థ మావయ్య ఎస్‌.ఎం.కృష్ణ గత ఏడాదే భాజపాలో చేరారు. ప్రస్తుతం ఐటీ అధికారులు సిద్ధార్థ కాఫీ ఎస్టేట్లలో కూడా తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.

వాడవాడలా బతుకమ్మ వేడుకలు

హనీప్రీత్‌లా అందంగా ఉందంటూ వెంటాడి…

పట్నా: ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ దత్తపుత్రిక హనీప్రీత్‌ సింగ్‌ ఇన్‌సాన్‌ కోసం రాష్ట్రాలన్నీ జల్లెడ పడుతున్నారు. నేపాల్‌ పారిపోయిందన్న వార్తల నేపథ్యంలో సరిహద్దులో కూడా ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె కనిపించిందన్న ఓ వార్త బిహార్‌ లో కనిపించిందన్న వార్తతో ఒక్కసారిగా పోలీసులు అలర్ట్ అయ్యారు. పశ్చిమ బెంగాల్‌ వైపు వేగంగా దూసుకెళ్తున్న ఓ బీఎండబ్ల్యూ కారును వెంబడించారు. సుమారు 30 కిలోమీటర్లపాటు సాగిన ఛేజింగ్ అనంతరం కారును […]

వాడవాడలా బతుకమ్మ వేడుకలు

కాళేశ్వరం పనుల్లో ప్రమాదం ఆరుగురు మృతి; ఇద్దరికి గాయాలు

సిరిసిల్ల: కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో విషాదం చోటుచేసుకుంది. సొరంగం పైకప్పు కూలిన ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే ఎస్పీ విశ్వజిత్‌ ప్రమాదస్థలికి చేరుకున్నారు. మధ్యమానేరు నుంచి మల్లన్నసాగర్‌ వరకు జరుగుతున్న పదో ప్యాకేజీ పనుల్లో ఈ ప్రమాదం జరిగింది. మరో రెండు రోజుల్లో ఈ పనులు పూర్తికానున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.ఝార్ఖండ్‌, బిహార్‌, […]

వాడవాడలా బతుకమ్మ వేడుకలు

‘జియోఫై’ పై భారీ డిస్కౌంట్‌: పండుగ ఆఫర్‌

హైదరాబాద్: టెలికాం మార్కెట్లో ఇప్పటికే సంచలనం సృష్టిస్తోన్న రిలయన్స్‌ జియో తమ ఖాతాదారులకు మరో బంపర్‌ ఆఫర్‌ అందుబాటులోకి తెచ్చింది. జియో హాట్‌ స్పాట్‌ ను ధరను సగానికి పైగా తగ్గించింది ‘జియో ఫై’ 4 జీ హాట్ స్పాట్ పై ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది. రూ. 1000 డిస్కౌంట్‌ తో పదిరోజుల పాటుచెల్లుబాటయ్యేలా పండుగ ఆఫర్‌ను లాంచ్‌ చేసింది. దసరా పండుగను పురస్కరించుకొని ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ కింద జియో ఫై ధరను రూ. […]

వాడవాడలా బతుకమ్మ వేడుకలు

షాకింగ్… ప్రారంభానికి ముందురోజే కూలిపోయిన భారీ ప్రాజెక్టు!

పాట్నా: బీహార్‌లో బుధవారం ఉదయం ఓ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. దాదాపు రూ.400 కోట్లతో నిర్మించిన ఘటేశ్వర్ పంత్ కెనాల్ ప్రాజెక్టు సరిగ్గా ప్రారంభానికి ముందురోజే కూలిపోయింది. బుధవారం బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేతుల మీదుగా దీన్ని ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. ప్రారంభోత్సవంపై మీడియాలో విస్తృతంగా ప్రకటనలు కూడా ఇచ్చింది. తీరా ప్రాజెక్టు కూలిపోవడంతో తీవ్ర గందరగోళానికి గురైన జలవనరుల మంత్రి లల్లాన్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పూర్తి సామర్థ్యంతో నీళ్లను ఒక్కసారిగా వదలడం వల్లే డ్యాం […]

వాడవాడలా బతుకమ్మ వేడుకలు

పద్మభూషణ్ పురస్కారానికి ధోనీ పేరును సిఫారసు చేసిన బీసీసీఐ

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు శుభవార్త. భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్‌కు ధోనీ పేరును బీసీసీఐ నామినేట్ చేసింది. కెప్టెన్ కూల్‌గా పేరున్న ధోనీకి 2007లో రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డు వచ్చింది. అనంతరం 2009లో పద్మ శ్రీ పురస్కారంతో ధోనీని కేంద్ర ప్రభుత్వం సత్కరించిన విషయం తెలిసిందే

సింధుకు నిరాశ

అమెజాన్‌ భారీ డిస్కౌంట్లు వాటిపైనే!

న్యూఢిల్లీ : అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌లో కూడా పండుగ సీజన్‌ ప్రారంభమైంది. నేటి నుంచి గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ను ప్రారంభించింది. 24వ తేదీ వరకు జరిగే ఈ ఫెస్టివల్‌ కంపెనీ బిగ్‌ డీల్స్‌ను ఆఫర్‌ చేస్తోంది. ఈ సారి ఫుడ్‌, గ్రోసరీలో భారీ మొత్తంలో డిస్కౌంట్లకు అమెజాన్‌ తెరతీసింది. ఈ-కామర్స్‌ గ్రోసరీ స్పేస్‌లో భారీ ఎత్తున్న పోటీ నెలకొనడంతో ఫుడ్‌, గ్రోసరీలో భారీ మొత్తంలో డిస్కౌంట్లను అమెజాన్‌ అందిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఆహారోత్పత్తులను నేరుగా వినియోగదారులకు […]

వాడవాడలా బతుకమ్మ వేడుకలు

అమ్మో డేరా బాబా.. 600 అస్తిపంజరాలు

సిర్సా : డేరా సచ్చా సౌదా గురించి మరిన్ని షాకింగ్‌ విషయాలు తెలిశాయి. మనుషులను చంపి కూడా అందులో పాతిపెట్టారనే విషయాలు ఇప్పటికే వెలుగు చూడగా అలా పాతిపెట్టినవారి సంఖ్య ఒకటో రెండో లేక ఏ పదుల సంఖ్యలో కాదు.. ఏకంగా వందల సంఖ్యలో ఉన్నాయి. దాదాపు 600కు పైగా అస్తిపంజరాలు డేరా సచ్చా సౌదాలో వెలుగుచూశాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం ఆశ్రమం అంతటా చేసిన తనిఖీల్లో కళ్లు చెదిరే సంఖ్యలో ఈ అస్తి పంజరాలు వెలుగుచూసినట్లు […]

వాడవాడలా బతుకమ్మ వేడుకలు