Home వార్తలు

వార్తలు

మెక్సికోను కుదిపేసిన భూకంపం

మెక్సికో సిటీ: మెక్సికో దేశాన్ని మంగళవారం అత్యంత శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. రిక్టర్‌ స్కేల్‌పై 7.4 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి 150మందికి పైగా మరణించారు. వేలాది మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వందలాది ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, వ్యాపార కార్యాలయాలు దెబ్బతినగా.. ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్యూబ్లాకు తూర్పు వైపున భూకంప కేంద్రం నమోదైనట్లు మెక్సికో భూకంప శాస్త్ర అధ్యయన సంస్థ తెలిపింది. ప్యూబ్లా, మొర్లస్‌, మెక్సికో […]

వాడవాడలా బతుకమ్మ వేడుకలు

ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థుల దుర్మరణం

ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసించడానికి వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రమాదవశాత్తూ మృతిచెందారు. హైదరాబాద్‌లోని కుంట్లూరుకు చెందిన శివ కాంత్ రెడ్డి, కడపకి చెందిన అశోక్‌ కుమార్‌ మారుగుత్తిలు ఉక్రెయిన్‌లోని జాపోరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌లో చదుతున్నారు. శివకాంత్‌రెడ్డి, అశోక్‌ కుమార్‌లు స్నేహితులతో కలిసి బీచ్‌లో వాలీ బాల్‌ ఆడుతుండగా బాల్‌ సముద్రంలో పడింది. బాల్‌ తీసుకురావడానికి వెళ్లిన ముఖేష్ అనే మిత్రున్ని రాకాసి అలలు సముద్రంలోకి లాక్కెల్లాయి. అతడిని కాపాడటానికి వెళ్లి, […]

వాడవాడలా బతుకమ్మ వేడుకలు

భారతీయులకు శుభవార్త చెప్పిన అమెరికా ప్రభుత్వం

వాషింగ్టన్:అయిదు నెలల క్రితం నిలిపివేసిన ‘హెచ్-1బీ వీసా ప్రీమియం ప్రాసెసింగ్’ స్కీమ్‌ను అమెరికా ప్రభుత్వం పునరుద్ధరించింది. లెక్కకు మించి వీసాలు రావడం, హెచ్-1బీ వీసాల జారీ విధానంలో మార్పులు చేయాలన్న తలంపుతో అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ ‘హెచ్-1బీ వీసా ప్రీమియం ప్రాసెసింగ్’ను తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఈ విధానాన్ని ఉపయోగించుకుని విదేశాల్లోని ఐటీ కంపెనీలు.. అమెరికాలోని తమ శాఖల్లో పనిచేసేందుకు ఏదైనా ఉద్యోగికి హెచ్-1బీ వీసాను వచ్చేలా చేయవచ్చు. కాకపోతే దీనికి 1225 డాలర్లు […]

వాడవాడలా బతుకమ్మ వేడుకలు

మళ్లీ నగదు దిశగా సీన్‌ రివర్స్‌

ముంబై: దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసిన రెండు నెలల్లోనే, అంటే ఈ ఏడాది జనవరి నాటికల్లా మహారాష్ట్రలోని థానె జిల్లా, ధసాయ్‌ గ్రామం నూటికి నూరుపాళ్లు నగదు రహిత లావాదేవీలు జరుపుతున్న గ్రామంగా ప్రసిద్ధికెక్కింది. దేశంలోనే రెండవ, మహారాష్ట్రలో మొట్టమొదటి నూటికి నూరుపాళ్ల డిజిటల్‌ గ్రామంగా దేశంలోని పత్రికలన్నీ కోడై కూశాయి. ప్రస్తుతం సీన్‌ పూర్తిగా రివర్స్‌ అయింది. గ్రామంలో 20 శాతం మంది కూడా నగదురహిత లావాదేవీలు నిర్వహించడం లేదు. 80 శాతం మందికిపైగా మళ్లీ […]

వాడవాడలా బతుకమ్మ వేడుకలు

శ్రీవారి లడ్డు ప్రసాదానికి కొత్త లైసెన్స్‌

తిరుమల : తిరుమల వెంకన్న ప్రసాదం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది లడ్డునే.  ప్రపంచ ప్రఖ్యాతి పొందిన శ్రీవారి లడ్డు ప్రసాదానికి కొత్త లైసెన్స్‌ లభించింది. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం లైసెన్స్‌ పొందింది. గతంలో లైసెన్స్‌ అవసరం లేదని టీడీపీ అధికారులు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అయితే  బెంగళూరుకు చెందిన ఆర్టీఐ కార్యకర్త నరసింహమూర్తి గతంలో లడ్డు నాణ్యతపై ఫుడ్‌ అండ్‌ సేఫ్టీ అధికారులకు […]

వాడవాడలా బతుకమ్మ వేడుకలు

యూపీ స్కూల్‌లో విద్యార్థిని మృతి.. అనుమానాలు

డియోరియా: ర్యాన్ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఉదంతం మరిచిపోక ముందే ఉత్తర ప్రదేశ్ లో మరో విద్యార్థిని మరణం సంచలనంగా మారింది. డియోరియా పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో మూడో అంతస్థు నుంచి పడి బాలిక మృతి చెందగా, అది హత్యేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోడ్రన్ సిటీ మాంటిస్సోరీ స్కూల్లో  నీతూ చౌహాన్‌(16)  9వ తరగతి చదువుతోంది.  సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మూడో అంతస్థులోని టాయ్‌ లెట్‌కి వెళ్లింది. ఎంత సేపటికి రాకపోవటంతో అనుమానం వచ్చిన తోటి […]

వాడవాడలా బతుకమ్మ వేడుకలు

గోవా పర్యాటకులకు చేదు వార్త

గోవా: చాలా మంది చాలాసార్లు గోవాకు వెళ్లాలని అనుకొని ఉంటారు. ఎంజాయ్‌ చేయడానికి, సరదగా, జాలీ ట్రిప్‌గా గోవానే ఎక్కువ మంది ఎంచుకుంటారు. ఇంక యువత సంగతి అయితే సరేసరి. బీచ్‌లో రెండు పెగ్‌లు వేసి సరదాగా తిరగాలి అనుకుంటారు.  చాలా మంది వెళ్లేది కూడా బీచ్ లు చూడ్డానికి, నాలుగు గుక్కలు ముందు వేసుకోవడానికే.  అందుకే సెలవులొస్తే చాలా మంది గోవా వెళ్లాలనుకుంటారు. అయితే, ఇపుడు గోవాలో ఆస్వేచ్ఛను అదుపుచేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. తరచూ పర్యాటకులపై దాడులు […]

వాడవాడలా బతుకమ్మ వేడుకలు

బోర్డింగ్‌ పాస్‌కు బై..బై..!

న్యూఢిల్లీ:  విమానాశ్రయాల్లో బోర్డింగ్‌ పాస్‌ విధానానికి స్వస్తి పలకాలని విమానయాన భద్రతా ఏజెన్సీలు భావిస్తున్నాయి. బోర్డింగ్‌ పాస్‌ల స్థానంలో బయోమెట్రిక్‌తో కూడిన ఎక్స్‌ప్రెస్‌ చెక్‌–ఇన్‌ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని యోచిస్తున్నాయి. దీని వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తప్పుతాయని, వారి ప్రయాణం సాఫీగా సాగుతుందని చెపుతున్నాయి. ఇటీవలే దేశంలోని 17 ఎయిర్‌పోర్ట్‌ల్లో హ్యాండ్‌బ్యాగేజ్‌ ట్యాగ్‌ల విధానానికి విమానయాన భద్రతా ఏజెన్సీలు స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. దేశంలోని 59 విమానాశ్రయాల్లో బోర్డింగ్‌ కార్డు రహిత విధానాన్ని అమలులోకి తేవాలని యోచిస్తున్నామని, […]

వాడవాడలా బతుకమ్మ వేడుకలు

మరో సచిన్ వస్తాడనుకోలేదు: సెహ్వాగ్

న్యూఢిల్లీ: తనకు పైరవీలు చేసి టీమిండియా కోచ్ పదవిని సాధించడం ఎలాగో తెలియదంటూ సరికొత్త  వివాదానికి తెరలేపిన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..  క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సాధించిన రికార్డులను ప్రత్యేకంగా కొనియాడారు. ఈ క్రమంలోనే తన పేరును సచిన్ టెండూల్కర్ గా మార్చుకుందామని  అనిపించిందంటూ సెహ్వాగ్ చమత్కరించారు. ‘సచిన్ సాధించిన రికార్డులు అమోఘం. సచిన్ కొల్లగొట్టిన రికార్డులకు నేను ఏమాత్రం దగ్గర్లో కూడా లేను. రికార్డులు సాధించడానికి పుట్టాడు కాబట్టే.. సచిన్ ను క్రికెట్ […]

సింధుకు నిరాశ

స్కూల్లో మ్యాథ్స్‌ చెప్పి పరువు తీసుకున్న మంత్రి

డెహ్రాడూన్‌ : మంత్రి వచ్చారన్న సంతోషం ఆ పాఠశాలలో ఎంతో సేపు నిలవలేదు. వచ్చి రాగానే ఆయన ఓ టీచర్‌కు పరీక్ష పెట్టి తీవ్రంగా అవమానించారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌ విద్యాశాఖమంత్రి అరవింద్‌ పాండే అనూహ్యంగా ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. వచ్చిరాగానే ఆ స్కూల్‌లోని గణితం బోధిస్తున్న టీచర్‌కు పరీక్ష పెట్టారు. తొలుత మైనస్‌ ప్లస్‌ మైనస్‌ కలిపితే మైనస్‌ వస్తుందా ప్లస్‌ వస్తుందా అని ప్రశ్నించగా టీచర్‌ మైనస్‌ […]

వాడవాడలా బతుకమ్మ వేడుకలు