Home రాజకీయం

రాజకీయం

వచ్చే బుధవారం రాజీనామా చేస్తా: జేసీ

అనంతపురం : అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఎంపీగా ఫెయిల్‌ అయినట్లు తన మనస్సాక్షి చెబుతోందని, అందుకే పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. చాగల్లుకు నీళ్లు తేలేని తానకు ఎంపీ పదవి ఎందుకని అన్నారు. తాడిపత్రి సాగు, తాగు నీటి అవసరాలను తీర్చలేకపోయానని, అలాగే అనంతపురంలో రోడ్లను విస్తరించలేకపోయినట్లు చెప్పారు.   తాను ఎవరి దయాదాక్షిణ్యాలతో గెలవలేదని, ప్రజల మద్దతుతోనే ఎంపీ అయ్యాయని అన్నారు. తనలాంటివాళ్లు రాజకీయాల్లో ఉండటం […]

డ్రగ్స్‌ ఆరోపణలు నిజమైతే.. నా కొడుకైనా సరే చంపాల్సిందే

డ్రగ్స్‌ ఆరోపణలు నిజమైతే.. నా కొడుకైనా సరే చంపాల్సిందే

మనీలా: ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటర్టె నిర్ణయాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసిందే. ఆ దేశంలో పేరుకుపోయిన డ్రగ్‌ మాఫియాను అరికట్టేందుకు ఇప్పటికే ఆయన అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. డ్రగ్‌ డీలర్స్‌ను కాల్చి చంపాలని ఆదేశించారు. తాజాగా ఆయన కుమారుడు డ్రగ్స్‌ అక్రమరవాణాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిపై అంతే కఠినంగా స్పందించారు రొడ్రిగో. ఆరోపణలు నిజమైతే తన కుమారుడిని కూడా చంపేయాల్సిందేనని చెప్పారు. రొడ్రిగో కుమారుడు పాలో డ్యుటర్టెపైన ప్రతిపక్ష నేత ఒకరు ఇటీవల […]

వచ్చే బుధవారం రాజీనామా చేస్తా: జేసీ

‘ట్రంప్‌ కుక్కలా మొరుగుతున్నాడు..!’

సియోల్‌: వరుస క్షిపణి ప్రయోగాలతో కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియా మరోసారి అమెరికాను రెచ్చగొట్టేందుకు సిద్ధమైంది. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలను కుక్క అరుపులతో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ అరుపులకు ఎవరూ భయపడట్లేదని ఉత్తరకొరియా విదేశాంగ మంత్రి అన్నారు. ఇటీవల ఐక్యరాజ్యసమితి వేదికగా తొలిసారి ప్రసంగించిన ట్రంప్‌.. ఉత్తరకొరియాపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. అమెరికా లేదా యూఎస్‌ కూటమి దేశాలు ఒక్కసారి దాడిచేస్తే ఉత్తరకొరియా పూర్తిగా నాశనమవుతుందని ట్రంప్‌ హెచ్చరించారు. ఐరాస సమావేశం […]

వచ్చే బుధవారం రాజీనామా చేస్తా: జేసీ

‘ఆ నివేదికల్లో నల్లధనం గుట్టు’

న్యూఢిల్లీః దేశవిదేశాల్లో భారతీయుల వద్ద పోగుపడ్డ నల్లధనం వివరాలపై యూపీఏ హయాంలో సమర్పించిన మూడు నివేదికలను పరిశీలిస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.  ఈ మూడు నివేదికల్లో బ్లాక్‌ మనీపై సమగ్ర వివరాలున్నట్టు సమాచారం. అయితే ఈ నివేదిక సారాంశం వివరాలు ఆర్‌టీఐ కింద వెల్లడించడం సాధ్యపడదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్‌టీఐ దరఖాస్తుదారుకు తెలిపింది.బ్లాక్‌మనీపై ఢిల్లీకి చెందిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ (ఎన్‌ఐపీఈపీ), నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనమిక్‌ రీసెర్చ్‌ […]

వచ్చే బుధవారం రాజీనామా చేస్తా: జేసీ

అన్నింట్లో ఫెయిలైన సీఎం యోగి

లక్నో: మినీ మోదీగా ప్రసిద్ధి చెందిన యోగి ఆధిత్యనాథ్‌ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఆర్నెళ్లు అవుతోంది. రాష్ట్ర సీఎం పదవికి ఆయన పేరును మార్చి 19వ తేదీన ప్రకటించగా, ఆయన మార్చి 26వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. మోదీ తర్వాత మోదీ అంతటి వారు ఆధిత్యనాథ్‌ అని, మోదీ అనంతరం ప్రధాన మంత్రయ్యే యోగ్యత కూడా యోగికే ఉందంటూ తెగ ప్రచారం జరిగింది. ఆయన ఉదయం లేవగానే ఆవులకు మేత పెట్టకుండా టిఫిన్‌ కూడా తినరని, ఆయన […]

వచ్చే బుధవారం రాజీనామా చేస్తా: జేసీ

అసెంబ్లీలో బల నిరూపణపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో బల నిరూపణపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు బల నిరూపణ నిర్వహించవద్దని తెలిపింది. అనర్హత వేటును సవాల్ చేస్తూ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు దాఖలు చేసిన ఫిటిషన్‌పై బుధవారం మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది. తమిళనాడు ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ముఖుల్ రోహత్గీ హాజరయ్యారు. అనర్హత వేటుపడిన దినకరన్ వర్గం ఎమ్మెల్యేల తరఫున సల్మాన్ ఖుర్షీద్ వాదించారు. డీఎంకే తరఫున కపిల్ సిబాల్ హాజరయ్యారు. 10 […]

వచ్చే బుధవారం రాజీనామా చేస్తా: జేసీ

మొత్తం నాశనం చేస్తా.. ఖబడ్దార్‌!

ఐక్యరాజ్యసమితి: ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తమను రెచ్చగొడుతూ ఉంటే.. ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు వెనకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఉత్తర కొరియాపై కఠినంగా వ్యవహరించేందుకు అన్ని దార్లూ తెరిచే ఉన్నాయని స్పష్టం చేశారు. ఉ.కొరియా అణ్వాయుధాలు, బాలిస్టిక్‌ క్షిపణులను తయారుచేసుకుంటూ.. మిగిలిన ప్రపంచాన్ని హెచ్చరిస్తూ మానవాళికి ప్రమాదకరంగా మారిందన్నారు. మంగళవారం ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో తొలిసారి ప్రసంగించిన ట్రంప్‌.. ఉ.కొరియాపై సైనికచర్య ప్రారంభించేందుకు ఏమాత్రం సంకోచించబోమని […]

వచ్చే బుధవారం రాజీనామా చేస్తా: జేసీ

చంద్రబాబుతో దర్శకుడు రాజమౌళి భేటీ

అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రముఖ దర్శకుడు రాజమౌళి బుధవారం ఉదయం భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాజమౌళితో పాటు మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ అధికారులు కూడా పాల్గొన్నారు. ఏపీ  రాజధానిలో నిర్మించబోయే అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ ఇచ్చిన డిజైన్లపై చర్చించారు. రాజధాని డిజైన్ల విషయంలో సహకారం అందిస్తామని సీఎం చంద్రబాబుకు ఈ సందర్భంగా రాజమౌళి తెలిపారు. భేటీ అనంతరం రాజమౌళి మాట్లాడుతూ… రాజధాని డిజైన్లు […]

వచ్చే బుధవారం రాజీనామా చేస్తా: జేసీ

ఉత్కంఠ రేపుతున్న తమిళ రాజకీయం!

చెన్నై: పళనిస్వామికి బలపరీక్ష ముప్పు.. దినకరన్‌ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు నేపథ్యంలో గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు మంగళవారం చెన్నైకి చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన సీఎం పళనిస్వామితో భేటీ కాబోతున్నారు. ఈ భేటీ అనంతరం అవిశ్వాస తీర్మానంపై గవర్నర్‌ నిర్ణయం తీసుకునే అవకాశముంది. రాజకీయ ఉత్కంఠకు తెరదించేవిధంగా బలపరీక్ష విషయంలో గవర్నర్‌ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వారం తర్వాత గవర్నర్‌ విద్యా సాగర్‌రావు చెన్నైకి రావడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దినకరన్‌ వర్గం ఎమ్మెల్యేలపై […]

వచ్చే బుధవారం రాజీనామా చేస్తా: జేసీ

బ్రేకింగ్: ములాయం, శివపాల్ కొత్త రాజకీయ ఫ్రంట్

లక్నో: ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో తలెత్తిన ముసలం తాజాగా కొత్త మలుపు తిరగనుంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పొత్తుల విషయంలో తండ్రీకొడుకులైన ములాయం, అఖిలేష్ మధ్య తలెత్తిన వివాదం చివరకు పార్టీ అధ్యక్ష పదవిని అఖిలేష్‌ దక్కించుకోవడం వరకూ వెళ్లింది. అప్పట్నించి అసంతృప్తితో రగులుతున్న ములాయం తాజాగా తన దారి తాను చూసుకోనున్నారు. మొదట్నించీ తనకు వెన్నుదన్నుగా నిలిచిన తన సోదదరుడు శివపాల్ యాదవ్‌తో కలిసి ‘కొత్త రాజకీయ ఫ్రంట్’ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు […]

వచ్చే బుధవారం రాజీనామా చేస్తా: జేసీ