Home రాజకీయం

రాజకీయం

చంద్రబాబు సహా 57మందికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌ : కృష్ణానది పరివాహక కరకట్ట ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం… ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా 57మందికి నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి మూడు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. కాగా సీఎం చంద్రబాబు ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటిని  నదీ పరిరక్షణ చట్టానికి విరుద్ధంగా నిర్మించిన లింగమనేని గ్రూపు నుంచి లీజుకు తీసుకున్నారు. ఇందులో […]

వచ్చే బుధవారం రాజీనామా చేస్తా: జేసీ

కేసీఆర్‌ ఎముకలు కూడా వదలడం లేదు: డీకే

హైదరాబాద్ ‌: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుపై గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రా పాలకులు తోలు మింగితే ఇప్పుడు కేసీఆర్‌ ఎముకలను కూడా వదలడం లేదని ఆమె విమర్శించారు. మంగళవారం డీకే అరుణ గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘చీరలు కాల్చారని ఆరోపిస్తూ మహిళల పై కేసులు పెట్టడం అమానుషం. మహిళలపై పెట్టిన కేసులను తక్షణమే విత్‌డ్రా చేయాలి. నాసిరకం బతుకమ్మ చీరలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. దానికి బదులు మహిళల అకౌంట్లలో […]

వచ్చే బుధవారం రాజీనామా చేస్తా: జేసీ

గన్‌మెన్‌ను సరెండర్‌ చేసిన టీడీపీ ఎమ్మెల్యే వంశీ

విజయవాడ: కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన గన్‌మెన్‌ను ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. టు ప్లస్‌ టు గన్‌మెన్‌లు కావాలని ఎమ్మెల్యే వంశీ ప్రభుత్వాన్ని కోరారు అయితే ఏపీ సర్కార్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తనకు అదనంగా సెక్యూరిటీ  ఇవ్వనందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన తనకు కేటాయించిన గన్‌మెన్‌ను వెనక్కి తిప్పి పంపించివేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ …‘నా గన్‌మెన్‌కు కేవలం […]

వచ్చే బుధవారం రాజీనామా చేస్తా: జేసీ

స్వాతంత్య్ర సమరయోధుడు సీవీ చారి ఇక లేరు

హైదరాబాద్‌: స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధేయవాది, ఆలిండియా హిందీ నాగరిక లిపి అధ్యక్షుడు సీవీ చారి(86) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కొద్ది రోజులుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన బంజారాహిల్స్‌ కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం విజయనగర్‌ కాలనీలోని శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో చారికి అంత్యక్రియలు నిర్వహించారు. రాజకీయ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధులు, సామాజికవేత్తలు హాజరై ఆయనకు ఘన నివాళులర్పించారు. చారికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. భూదానోద్యమంలో కీలక పాత్ర పోషించిన […]

వచ్చే బుధవారం రాజీనామా చేస్తా: జేసీ

రాజ్‌నాథ్‌తో తమిళనాడు గవర్నర్‌ భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో తమిళనాడు తాత్కాలిక గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు మరోసారి భేటీ అయ్యారు. మంగళవారం ఉదయం ఇక్కడ జరిగిన ఈ సమావేశంలో మిళనాడు రాజకీయలపై చర్చ జరిగినట్లు సమాచారం. కాగా టీటీవీ దినకరన్‌ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్‌ అనర్హత వేటు వేయడంతో  రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కాయి. ఈ నేపథ్యంలో విద్యాసాగర్‌రావు నిన్న కూడా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, హోంమంత్రితో వేర్వేరుగా సమావేశం అయిన విషయం తెలిసిందే. మరోవైపు […]

వచ్చే బుధవారం రాజీనామా చేస్తా: జేసీ

ఐలయ్యపై కేసు నమోదుకు ఏపీ డీజీపీ ఆదేశం

అమరావతి: ప్రొఫెసర్‌ కంచ ఐలయ్యపై కేసు నమోదుకు ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ సాంబశివరావు ఆదేశాలు ఇచ్చారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా పుస్తకం రాసి…కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ ఆర్యవైశ్య సంఘాలు ఫిర్యాదు చేశాయి. దీంతో ఐలయ్యపై కేసు నమోదు చేయాలని సీఐడీ అధికారులను డీజీపీ మంగళవారం ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించిన తర్వాతే డీజీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రముఖ రచయిత, ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య రాసిన సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే […]

వచ్చే బుధవారం రాజీనామా చేస్తా: జేసీ

జియోకు చెక్‌: రూ.32వేల కోట్లతో ప్లాన్‌

న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్‌లో దూసుకుపోతున్న రిలయన్స్‌ జియోకు చెక్‌ పెట్టడానికి దిగ్గజ కంపెనీలన్నీ భారీ ఎత్తున్న ప్లాన్లు వేస్తున్నాయి. టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ అయితే ఏకంగా రూ.32వేల కోట్లను వెచ్చించబోతుంది. తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడానికి వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ.32వేల కోట్లకు పైగా వెచ్చించాలని చూస్తున్నట్టు తెలిసింది. అదేవిధంగా రెవెన్యూ మార్కెట్‌ షేరులో 3-4 శాతం పాయింట్లను అధికంగా ఇది దక్కించుకోవాలనుకుంటోంది. మిగతా కంపెనీలు ఐడియా సెల్యులార్‌, వొడాఫోన్‌ ఇండియాలు కూడా జియోకు అడ్డుకట్ట వేయడానికి […]

వచ్చే బుధవారం రాజీనామా చేస్తా: జేసీ

పేదల నుంచి పార్టీ ఫండ్‌

చెన్నై: రాజకీయ పార్టీ స్థాపన కోసం పేదల నుంచి నిధులు సమీ కరిస్తానని నటుడు కమల్‌హాసన్‌ తెలిపారు. ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చిన తాను త్వరలో పార్టీని ప్రకటిస్తానని అన్నారు. ప్రముఖ తమిళ దినపత్రిక ‘ది హిందూ’ చెన్నైలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ఒక సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వక్తలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధా నాలిచ్చారు. ‘పేదల జీవన పరిస్థితులు మె రుగుపడటం అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉంటా. అది గాం«ధేయవాదమా, మార్క్సి జమా అనేది ముఖ్యం కాదు’ […]

వచ్చే బుధవారం రాజీనామా చేస్తా: జేసీ

ఎమ్మెల్సీలుగా సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రమాణం

లక్నో : ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ)గా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సహా డిప్యూటీ సీఎంలు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, దినేష్‌ శర్మతోపాటు మంత్రులు స్వతంత్రదేవ్‌ సింగ్‌, మోహసిన్‌ రజాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇతర పార్టీల నేతలు నామినేషన్లు దాఖలు చేయకపోవటంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రదీప్‌ దూబే ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం […]

వచ్చే బుధవారం రాజీనామా చేస్తా: జేసీ

18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామం తలెత్తింది. రాజకీయ ఉత్కంఠకు తెరదించే విధంగా బల పరీక్ష విషయంలో గవర్నర్‌ నిర్ణయం ఎలా ఉండబోతుందోనని ఎదురు చూపులు చూడగా చివరికి దినకరన్ వర్గానికి స్పీకర్ భారీ షాకిచ్చారు. అన్నాడీఎంకే ఉపప్రధాన కార్యదర్శి దినకరన్‌ వర్గానికి చెందిన 18 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. సీఎం పళని స్వామిపై తిరుగుబావుట ఎగురవేసిన ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ పి.ధనపాల్ సోమవారం ప్రకటించారు. దీంతో దినకరన్ […]

వచ్చే బుధవారం రాజీనామా చేస్తా: జేసీ