ఉత్తరకొరియా మరోసారి కయ్యానికి కాలు దువ్వింది

0
59

ఉత్తరకొరియా తూర్పు తీరం నుంచి రెండు క్షిపణులు సముద్రంలో పరీక్షించినట్లు దక్షిణకొరియా మిలటరీ చీఫ్ చెప్పారు. అణ్వాస్త్రాల పరీక్షలను నిలిపివేయాలని అమెరికా ఉత్తరకొరియా మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలోనే కిమ్ జాంగ్ ఉన్ క్షిపణులు పరీక్షించడం చర్చనీయాంశమైంది. తూర్పు తీరంలో ఉన్న వాన్సన్ నగరం నుంచి పరీక్షించిన క్షిపణులు 430 కిలోమీటర్లు మేరా ప్రయాణించి సముద్రంలో పడిపోయినట్లు దక్షిణ కొరియా మిలటరీ చీఫ్ చెప్పారు. ఇదిలా ఉంటే క్షిపణి జపాన్ ఎకనామిక్ జోన్‌ వరకు రాలేదని తమ దేశ భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని జపాన్ రక్షణశాఖ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి