యావ‌త్ భార‌త దేశాన్ని వ‌ణికించిన రాజీవ్ గాంధీ హ‌త్య‌కేసులో ప్ర‌ధాన నిందితురాలు విడుద‌ల

0
20

యావ‌త్ భార‌త దేశాన్ని వ‌ణికించిన రాజీవ్ గాంధీ హ‌త్య‌కేసులో ప్ర‌ధాన నిందితురాలు న‌ళిని శ్రీహ‌ర‌న్ జైలు నుంచి విడుద‌ల అయ్యారు. త‌మిళ‌నాడులోని రాయ‌వేలూరు కేంద్ర కారాగారంలో జీవిత ఖైదును అనుభ‌విస్తున్నారు. గురువారం ఉద‌యం ఆమె పెరోల్‌పై విడుద‌ల అయ్యారు. 30 రోజుల ఆంక్ష‌ల‌తో కూడిన‌ పెరోల్‌ను ఆమెకు మంజూరు చేస్తూ మ‌ద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. త‌న‌ కుమార్తె వివాహానికి హాజ‌రు కావాల్సి ఉంద‌ని, పెళ్లి ఏర్పాట్ల‌ను చేయాల్సి ఉన్నందున త‌న‌కు క‌నీసం ఆరు నెల‌ల పాటు పెరోల్ మంజూరు చేయాల్సిందిగా న‌ళిని మ‌ద్రాస్ హైకోర్టును అభ్య‌ర్థించారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి