వెంకాయమ్మ అనే మహిళ ఫిర్యాదుతో కోడెల శివప్రసాదరావు కుమార్తె పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

0
86

 

 

నరసరావుపేటకు చెందిన వెంకాయమ్మ అనే మహిళ ఫిర్యాదుతో ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుమార్తె పి.విజయలక్ష్మిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. జూన్ 26న నరసరావుపేట ఒన్‌టౌన్ పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 420, 506, ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్‌ 3(1)(ఆర్‌), 3((2)కింద నమోదు చేశారు. ఈ కేసులో విజయలక్ష్మిని ఏ2గా పేర్కొనడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కోడెల కుమార్తెకు ఊరట లభించింది. ఈ కేసులో విజయలక్ష్మిని అరెస్టు చేయవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన కోర్టు, విచారణను ఆగస్టు 13కి వాయిదా వేసింది. హైకోర్టు ర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు బుధవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి