ఉగ్రవాద నిర్మూలన చూపించాల్సింది చేతల్లో మాటల్లో కాదు

0
25

అప్పుడే ఇమ్రాన్ ఖాన్ మాటలు నమ్ముతాం.. భారత్ఉగ్రవాద నిర్మూలపై పాకిస్థాన్ మాటలు చెప్పకుండా చేతల్లో చూపించాలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావిశ్ కుమార్ డిమాండ్ చేశారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పీకేయాలని ఆయన కోరారు. ఇందుకోసం చిత్తశుద్దితో పనిచేసినప్పుడే సాధ్యమవుతుందని ఆయన హితవు పలికారు.అయితే భారత దేశం మాత్రం ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని చెప్పడం హృదయపూర్వకంగా చేసిన వ్యాఖ్యలుగా చూడడం లేదని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ మొదటి సారి పాకిస్థాన్‌లో ఉగ్రవాదులతో పాటు వారి స్థావరాలు కూడ ఉన్నట్టు ఉన్నట్టు ఒప్పుకున్నారని ,అయితే పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాదులను పూర్తిగా నిరోధించాలని అన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు మొదటి సారి కాదని, ఇలాంటీ వ్యాఖ్యలు పాకిస్థాన్ చాలసార్లే చేసిందని తెలిపారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి