దూసుకుపోతున్న ఇస్మార్ట్ శంకర్

0
72

తెలుగు సినీ ఇండస్ట్రీలోని అందరు హీరోలతో సినిమాలు చేసిన దర్శకుల్లో పూరీ జగన్నాథ్ ఒకరు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన.. ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో చేసిన చిత్రమే ‘ఇస్మార్ట్ శంకర్’. గత వారం విడుదలైన ఈ సినిమా మొదట మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత క్రమంగా పుంజుకుని హిట్ చిత్రంగా నిలిచింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో హౌస్‌ఫుల్ షోలతో దూసుకుపోతోంది. అలాగే భారీ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను తిరగరాసింది. తాజాగా ఈ సినిమాకు ఊహించని బూస్ట్ వచ్చింది.జులై 18వ తేదీన విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’.. బీ, సీ సెంటర్లలో దూసుకుపోతోంది. పక్కా మాస్ మసాలా చిత్రం కావడంతో ఈ పరిస్థితి వచ్చింది. ఫలితంగా రెండు రాష్ట్రాల్లో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. గురువారంతో వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 27.67 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.సినిమా గ్రాండ్ సక్సెస్ అవడంతో చిత్ర యూనిట్ విజయోత్సవ యాత్ర చేస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూల్, విజయవాడ సహా ఎన్నో ప్రాంతాల్లో పూరీ జగన్నాథ్, ఛార్మీ, నిధి అగర్వాల్ పర్యటించారు. అలాగే, మరికొన్ని ప్రాంతాల్లో కూడా విజయ యాత్ర చేస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి