మళ్లీ బరిలోకి యువరాజ్‌ సింగ్‌

0
27

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ మళ్లీ బరిలోకి దిగాడు. కెనడాలో జరుగుతున్న గ్లోబల్‌ టి20 టోర్నమెంట్‌లో టొరంటో నేషనల్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. వాంకోవర్‌ నైట్స్‌ టీమ్‌తో గురువారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో యువీ నిరాశపరిచాడు. 27 బంతుల్లో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి స్టంపౌట్‌ అయ్యాడు. అయితే రీప్లేలో అతడు నాటౌట్‌ అయినట్టు గుర్తించినా, అప్పటికే యువీ మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. రిజ్వాన్‌ బౌలింగ్‌లో యువరాజ్‌ ఆడిన బంతి అతడి బ్యాట్‌ ఎడ్జ్‌కు తగిలి కీపర్‌ చేతుల్లోంచి వికెట్ల మీద పడింది. యువీ క్రీజ్‌లోనే ఉన్నట్టు రీప్లేలో కనబడింది. అయితే బ్యాట్‌ ఎడ్జ్‌కు తగిలిన బంతి వికెట్లను పడగొట్టిందన్న భావనతో యువీ మైదానాన్ని వీడినట్టుగా అనిపించింది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి