సందర్శకులను కనువిందు చేస్తున్న జలపాతాలు

0
50

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని దట్టమైన అడవుల్లోని కొండల మధ్య జాలువారుతున్న దృశ్యాలు చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. అడవుల్లో అందాలు దాగి ఉన్న అందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. జలపాతాల వద్ద సరైన వసతులు లేకున్నప్పటికీ పర్యాటకుల సంఖ్య ఏడాదికి ఏడాది పెరుగుతూనే ఉంది. పలు జలపాతాల వద్దకు వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యం కల్పిస్తే మరింతగా అభివృద్ధి చెందే అవకాశాలు లేకపోలేదు. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలంలోని చింతల మాదర, గుండాల జలపాతం సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. చింతలమాదర జలపాతానికి చేరుకోవాలంటే మండల కేంద్రం నుంచి 15కిలో మీటర్ల వయా సుంగాపూర్‌ వరకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మూడు కిలో మీటర్ల ముందు నుంచి నడకనే ద్వారానే వెళ్లడం సాధ్యమవుతుంది. మండలంలోని మరో జలపాతం గుండాల.ఈ జలపాతం చేరుకోవాలంటే 16కిలో మీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందులో 10కిలో మీటర్లు వయా రోంపెల్లి మీద నుంచి వాహనాల ద్వారా వెళ్లవచ్చు. మిగత ఆరు కిలో మీటర్లు దట్టమైన అడవి కొండలపై నడుచుకుంటూ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం పర్యాటకులకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని గురిస్తే అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి