రెండు అరటిపండ్లకు రూ.442 వసూలు చేసిన హొటల్‌కు 25000 వేల జరిమాన

0
27

చండీగఢ్‌లో ఉన్న జేడబ్ల్యూ మారియట్ హోటల్లో నటుడు రాహుల్ బోస్ జిమ్‌ చేసిన అనంతరం రెండు అరటిపళ్లు తిన్నాడు.అయితే రాహుల్ బోస్ తిన్న రెండు అరటిపళ్లకుగాను హోటల్ యాజమాన్యం జీఎస్టీతో కలిపి రూ.442.50 బిల్లు వేసింది. దీంతో షాక్ తిన్న రాహుల్ ‘పండ్లు కీడు చేయవని ఎవరు చెప్పారు? ఇదే ఉదాహరణ.’ అంటూ ఆ బిల్లును తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇది నెట్టింట్లో ,తెగహల్‌చల్‌ చేసింది. ఆ హోటల్ మీద నెటిజన్లు విరుచుకుపడ్డారు. బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్‌ తిన్న రెండు అరటిపండ్లకు రూ.442 వసూలు చేసిన జేడబ్ల్యూ మారియట్ హొటల్‌కు తగిన గుణపాఠం చెప్పారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. ఈనేపథ్యంలోనే అధిక డబ్బులు వసూలు చేసిన హోటల్‌పై చర్యలు తీసుకున్నారు. దీంతో సంబంధిత హోటల్‌పై రూ.25000 జరిమాన విధించారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి