విరాట్ కోహ్లి రోహిత్ శర్మ మధ్య తలెత్తిన విభేదాలపై స్పష్టత

0
49

భారత కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య తలెత్తిన విభేదాలపై స్పష్టత వచ్చే ఏకైక అవకాశం కూడా తాజాగా చేజారిపోయింది. వెస్టిండీస్‌ పర్యటన కోసం భారత్ జట్టు సోమవారం బయల్దేరనుండగా.. ఈ ప్రయాణానికి ముందు జరగాల్సిన ప్రెస్‌మీట్‌‌కి విరాట్ కోహ్లీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. సాధారణంగా విదేశీ పర్యటనకి వెళ్లే ముందు మీడియా సమావేశంలో భారత జట్టు కెప్టెన్ మాట్లాడటం ఆనవాయితీగా వస్తోంది. జట్టు ఎంపిక, కూర్పుతో పాటు టీమ్ భవిష్యత్ ప్రణాళికలపై ఈ సమావేశంలో మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకి కెప్టెన్‌ హోదాలో సమాధానాలివ్వడం పరిపాటి. కానీ.. తాజాగా రోహిత్ శర్మతో విభేదాలు తలెత్తాయనే వార్తలు ఎక్కువగా వినిపిస్తుండంతో ఆ గొడవకి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతాయనే ఉద్దేశంతో కోహ్లీ ఈ సమావేశానికే దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి