అనంతపురం లో రెవెన్యూ శాఖకు సిబ్బంది కొరత

0
68

అనంతపురం జిల్లా పరిపాలనలో అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖకు సిబ్బంది కొరత పట్టిపీడిస్తోంది. దీంతో రెవెన్యూ సిబ్బందిపై పనిభారం పెరగగా…పనులు సకాలంలో జరగక ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే భూపరిపాలన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) కార్యాలయం నుంచి తహసీల్దార్లను జిల్లాకు ఎప్పుడు కేటాయింపు జరుగుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. పరిపాలనాధికారి పోస్టులే ఖాళీ .. ప్రస్తుతం జిల్లాలోని 17 తహసీల్దార్లు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఐదు రెవెన్యూ డివిజన్లు ఉండగా.. అందులో నాలుగు డివిజన్‌లలో పరిపాలనాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కలెక్టరేట్‌లో రెండు విభాగాలకు సంబంధించి సూపరింటెండెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక 11 మండలాల్లో తహసీల్దారు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి