సౌదీ అరేబియా మహిళ ట్వీట్‌ కు స్పందించిన కేటీఆర్‌

0
84

మా నాన్న చనిపోయారు. ఇండియా రావాలనుంది. నాకు మీ సహకారం కావాలి’అంటూ రంగారెడ్డి జిల్లా కర్మన్‌ఘాట్‌లోని భూపే ష్‌గుప్తా నగర్‌కు చెందిన రాములు కుమార్తె జి.సునీత సౌదీ అరేబియా నుంచి మాజీ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేసింది. ‘గత డిసెంబర్‌లో మా చెల్లి చనిపో యింది. అప్పుడు కూడా వీళ్లు నన్ను పంపించలేదు. ఈ నెల 26న మా నాన్న చనిపోయాడు. ఇండియాకు రావాలని ఉంది. నాన్నను చూడాలని ఉంది. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేదు. అయినా వీళ్లు పంపడం లేదు. పాస్‌పోర్ట్‌ తీసుకుని ఇవ్వడం లేదు. దయచేసి నాకు సహాయం చేయండి సార్‌’అని కేటీఆర్‌ను వేడుకుంది. దీనికి ఆయన వెంటనే స్పందించారు. సౌదీ అరేబియా ఎంబసీ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు పూర్తి వివరాలు పంపాల్సిందిగా సూచించారు. ఇండియాకు తీసుకొచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి