విజయ్‌ దేవరకొండ షాకింగ్ లుక్‌

 విజయ్‌ దేవరకొండ షాకింగ్ లుక్‌

ఫాదర్స్‌ డేని పురస్కరించుకొని ఆదివారం సినీ సెలబ్రిటీలు తమ తండ్రులకు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. ఇక దేవరకొండ కూడా తన తండ్రి గోవర్ధన్ రావుకు సోషల్ మీడియాలో విషెస్ చెప్పారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో  చాలా మంది సెలబ్రిటీలు తమ స్టైల్‌ను మార్చేసుకుంటున్నారు. కొత్త లుక్‌లతో ఫ్యాన్స్‌కి దర్శనమిస్తున్నారు. తాజాగా విజయ్‌ దేవరకొండ షాకింగ్ లుక్‌లో కనిపించారు.

ఈ సందర్భంగా తన తండ్రితో తీసుకున్న ఫొటోను షేర్ చేసిన విజయ్‌.. ”నేను నీతో ఉంటా. ఈ విషయాన్ని నువ్వు నాకు ఎప్పుడూ చెప్తుంటావు. నేను నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, తప్పులు చేసినప్పుడు, రిస్క్‌లు చేసినప్పుడు, అడ్వెంచర్‌లు చేసినప్పుడు నువ్వు నాకు ఆ మాట చెప్తూనే ఉంటావు. హ్యాపీ ఫాదర్స్‌ డే డాడీ. ఐ లవ్ యు” అంటూ కామెంట్ పెట్టారు.  కాగా ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ ఫైటర్‌లో నటిస్తున్నారు. పూరీ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

News 9

Related post