మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జంట్ ‘ఆచార్య’ కంప్లీట్ చేసే ప‌నిలో బిజీ

 మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జంట్ ‘ఆచార్య’ కంప్లీట్ చేసే ప‌నిలో బిజీ

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జంట్ ‘ఆచార్య’ కంప్లీట్ చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు.తాజాగా రామ్ చ‌ర‌ణ్ ఈ ప్రాజెక్ట్ నుంచి సైడ్ అయిపోతున్న‌ట్టు స‌మాచారం. రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తోన్న తాజా మూవీ ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ కూడా త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. అందులో చెర్రీ షెడ్యూల్స్ కూడా ఉన్నాయి. ఆ షూటింగ్ ముగిసేస‌రికి టైమ్ ప‌ట్టే అవ‌కాశం ఉండ‌టంతో..మ‌రో న‌టుడివైపు ఆచార్య యూనిట్ ఫోక‌స్ పెట్టార‌ట‌. దీనికి చిరు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యంపై త్వ‌ర‌లోనే స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వం షూటింగుల‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌డంతో త్వ‌ర‌లోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. సామాజిక సందేశంతో వ‌స్తోన్న ఈ మూవీని స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తోంది .ఈ చిత్రాన్ని మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కిస్తున్నాడు. అందులో ఆయ‌న కీలక పాత్ర కూడా పోషించోతున్న‌ట్టు వార్త‌లు వినిపించాయి. రామ్ చరణ్ వేసవిలో తన పాత్ర కోసం షూటింగ్ ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ, క‌రోనా లాక్ డౌన్ అన్ని ప్లానింగ్స్ ఆగిపోయాయి.

News 9

Related post