గ్రామాల అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి అజయ్ 

 గ్రామాల అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం :  మంత్రి అజయ్ 

గ్రామాల అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం. మంత్రి అజయ్  గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత టీఆర్యస్ ప్రభుత్వనేదని, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.ఈరోజు సిరిపురం రైతు వేదిక నిర్మాణానికి, శంకుస్థాపన చేశారు. అనంతరం వైకుంఠధామం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రైతును రాజు చేసిన ప్రభుత్వం తమ ప్రభుత్వం అన్నారు. మధిర నియోజకవర్గంలో సంవత్సరానికి రైతు సాయం కింద 180 కోట్లు అందించిన ఘనత తమ ప్రభుత్వాన్ని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్ వి కర్ణన్, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, వైస్ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, నల్లమల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

News 9

Related post