కాపులకు TDP ప్రభుత్వం కల్పించిన 5 శాతం రిజర్వేషన్లు పురరుద్దరించాలి… – మాజీ ఎమ్మెల్యే బండారు

 కాపులకు TDP ప్రభుత్వం కల్పించిన 5 శాతం రిజర్వేషన్లు పురరుద్దరించాలి… – మాజీ ఎమ్మెల్యే బండారు

కొత్తపేట : రాష్ట్రంలోని కాపులకు TDP ప్రభుత్వం EBC కోటా ద్వారా కల్పించిన 5 శాతం రిజర్వేషన్లను వైసిపీ ప్రభుత్వం వెంటనే పురరుద్దరించాలని నియోజకవర్గ TDP ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు డిమాండ్ చేసారు. ఆదివారం ఆయన వాడపాలెం తన స్వగృహంలో ఒక ప్రకటన ద్వారా తెలిపారు. స్వతంత్ర్యం వచ్చినప్పటి నుండిరాష్ట్రంలో అత్యధిక సంఖ్యాకులైన కాపులను అధికారంలోనికి వచ్చిన ప్రతిపార్టీ ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకున్నారు. ఒక TDP ప్రభుత్వమే ముఖ్యంగా మాజీ CM చంద్రబాబు నాయుడే కాపులను గుర్తించారు. కాపులను BC లలో చేరుస్తానని మాటిచ్చిన ప్రకారమే వారికీ కాపు కార్పోరేషన్ ఏర్పరచి, అత్యధికంగా రుణాలు ఇవ్వడం జరిగిదన్నారు. అలాగే కాపులను BC లలో చేర్చేందుకు మంజునాధ కమీషన్ వేసి కేంద్రం కల్పించిన EBC 10 శాతం రిజర్వేషన్ లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించి మాజీ CM చంద్రబాబు చరిత్ర పుటల్లో నిలిచారు. మీ వైసిపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి EBC కోటాలోని కాపు రిజర్వేషన్లు రద్దు చేసియున్నారు. అలాగే కాపు కార్పోరేషన్ ద్వారా ఇవ్వాల్సిన రుణాలు ఇంత వరకు ఇవ్వలేదన్నారు. TDP ప్రభుత్వం కాపు విద్యార్దులకు విదేశీ విద్యా మరియు ఉన్నత విద్యను అభ్యసించేందుకు NTR విద్యోన్నతి పధకాన్నిప్రవేశపెట్టి వారి ఉన్నత విద్యకు అవసరమయ్యే కోచింగ్ ఖర్చులు కూడా భరించేదన్నారు. అలాగే కాపు మహిళలకు 3 నెలల కుట్టు శిక్షణ ఇచ్చి వారికి ఉచితంగా కుట్టు మిషన్లు మంజూరు చేసిందన్నారు. ఇపుడు వైసిపీ పభుత్వం అన్నివర్గాల మహిళల ఇచ్చేరూ.15000 పధకాన్ని ప్రవేశపెట్టి గొప్పలు చెప్పుకుంటుదన్నారు. ఇందులో కాపులకు చేసిన ప్రత్యేక లబ్ది ఏమి లేదని ఎద్దేవా చేసారు. వైసిపీ పభుత్వంలో ఉన్న కాపు మంత్రులు ముందు కాపులకు TDP ప్రభుత్వం ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్లను పునరుద్దరించేటట్లు ఒప్పించాలని హితవు పలికారు.

News 9

Related post