రోడ్డుపై దొరికిన పర్సును బాధితుడు కి అందజేత పర్సులో 30 వేల రూపాయలు నగదు,ఎటిఎం కార్డులు

 రోడ్డుపై దొరికిన పర్సును బాధితుడు కి అందజేత  పర్సులో 30 వేల రూపాయలు నగదు,ఎటిఎం కార్డులు

: రావులపాలెం // రావులపాలెం మండలంలోని దేవరపల్లి రాజుగారిదొడ్డి గ్రామంలో రోడ్డు ప్రక్కన పడివున్న పర్సును కొత్తపేట గ్రామానికి చెందిన పలువురు అటుగా వెళుతుండగా వారి కంట్లో పడింది.వెంటనే ఆ పర్సును తెరిచి చూడగా అందులో 30 వేల రూపాయలు నగదు, ఏటీఎం కార్డులు, డ్రైవింగ్ లైసెన్సు ఉన్నాయి.డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా అడ్రస్ ను కనుగొని ఊబలంక గ్రామానికి చెందిన చిటికెన నాగబాబు కు నగదు,పర్సును అందజేశారు.కొత్తపేట కు చెందిన బూసి భాస్కరరావు,గంగుమళ్ళ రాజు,బయ్యే రాంబాబు,పితాని చిన్నా లు అందజేసారు. ఈ సందర్భంగా పలువురు వీరిని అభినందించారు.

News 9

Related post