మధురవాడ బస్టాప్! ఇక్కడ అన్ని బైకులు రిపేర్ చేయబడును…

 మధురవాడ బస్టాప్! ఇక్కడ అన్ని బైకులు రిపేర్ చేయబడును…

విశాఖపట్నం:
ప్రయాణికులు వేచి ఉండటం కోసం నిర్మించార లేక మెకానిక్ షెడ్ నిర్వాహునికి అద్దెకు ఏమైనా జి.వి.ఎమ్.సి వారు ఇచ్చార అంటున్న ప్రజలు

నడిరోడ్డు పై బైకులు మరమ్మత్తులు యథేచ్ఛగా చేస్తూ ట్రాఫిక్ అవాంతరానికి మధురవాడ బస్టాప్ వద్ద కారమవుతున్నవారు ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి కానరావకపోవడం గమనార్హం

మధురవాడలో ఉండే బస్టాప్ మెకానిక్ షెడ్డుగా మారిపోయింది.వాహనాలు తిరిగే రోడ్ల పైనే రిపేర్కు వచ్చిన బైకులు మరమ్మత్తులు నిర్వహించడం పరిపాటైపోయింది.ట్రాఫిక్ అవాంతారాలకు కారణమవుతున్న ట్రాఫిక్ పోలీసులకు కానరాకపోవడం గమనార్హం. ఒకే సమయంలో మెకానిక్లు ఫుట్ ఫాత్ల పై రోడ్డు మీద మరమ్మత్తులు చేసుకోవాడానికి వచ్చిన బైకులు ఉంచి రిపేర్ చేస్తుంటే ట్రాఫిక్ జామ్ అవుతున్న సందర్బాలెన్నో ఇవి ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి కాన రావడం లేదు. మోటార్ వాహనాల రిపేర్ కారణంగా ట్రాపిక్ జామయ్యి వాహనాలు రోడ్డుకి అడ్డంగా నిలుస్తున్న సందర్భంలో ఆమార్గం గుండా వచ్చే వాహనాలకు ఫోటోలు తీస్తూ ట్రాఫిక్ పోలీసులు ఫైన్లు వేస్తున్నారే తప్ప ట్రాఫిక్ నిలిచి పోవడానికి కారణమవుతున్న మధురవాడ బస్టాప్ (మెకానిక్ షెడ్)ను కనీశం టచ్ చేయకపోవడం పై పలు అనుమానాలు వస్తున్నాయి.బైకులు మరమ్మతులు చేస్తున్న కారణంగా ఫుట్ఫాత్ పై పలకలు కూడా విరిగిపోయి మధురవాడ రోడ్లపై నడుస్తున్న ప్రతి పౌరునికి దర్శనమ్మిస్తున్నాయి.ఇక బస్టాప్ సంగతికి వస్తే ప్రయాణం చేసే వారు వచ్చే బస్ కోసం వేచి చూసే సమయంలో కూర్చోవడానికి ఏర్పరచిన ఇనుప బల్లలు సైతం కొందరి ఆకతాయిల వల్ల విరిగిపోవడం జరిగింది.
ఈ స్థలంలో బస్టాప్ ఏర్పాటు చేశారా లేక జి.వి.ఎమ్.సి వారు మెకానిక్ షెడ్ నిర్వాహునికి అద్దెకు ఏమైనా ఇచ్చారా లేక అధికారుల దృష్టికి రావా లేక కనబడవా అంటూ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నా అధికారులలో చలనం లేదు.జివిఎంసి అధికారులకు ప్రజలు వచ్చి చెప్తేనే ప్రజలకు కలిగే ఇబ్బందులు కనబడతాయ అంటూ ప్రజలు వారి అభ్యంతరాలను తెలియచేశారు.ముఖ్యంగా మధురవాడ కరెంట్ ఆఫీస్ వద్ద నుండి ఈ వరల్డ్ వరకు ఫుట్ ఫాత్లపై ప్రజలు నడిచే అవకాశం లేకుండా పోయింది.కనీసం ఇప్పటికైనా జి.వి.ఎమ్.సి వారు సమీక్షించి వారి భాషలో (పబ్లిక్ ఇన్కన్వినియన్స్) పై దృష్టి పెట్టాలని ప్రజలే వచ్చి మీకు ఫిర్యాదులు చేయనవసరం లేదని, ప్రజా భద్రతను చూడడం కూడా మీవంతని పౌర సంఘాల నాయకులు,ప్రజలు తెలియచేశారు.

News 9

Related post