ప్రతిష్టాత్మకమైన పార్కుగా పీజేఆర్ నగర్ క్వారీ పూడ్చిన స్థలం

 ప్రతిష్టాత్మకమైన పార్కుగా పీజేఆర్ నగర్ క్వారీ పూడ్చిన స్థలం

కూకట్పల్లి జూన్ 28: డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ లో గల క్వారీ గుంత పూర్తిగా పూర్తి వేయడంతో 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కూకట్పల్లి డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి కలిసి అట్టి స్థలాన్ని పర్యవేక్షించడం జరిగింది. డివిజన్ లోని పేరు గాంచిన పార్కుగా అభివృద్ధి చేయాలని చుట్టూ పెన్సింగ్ వేసి మొక్కలు నాటవలసిన అవసరం ఉందని డి సి ని కోరడం జరిగింది. దానికి డి సి స్పందించి ఇట్టి స్థలానికి వీలైనంత త్వరగా ఫెన్సింగ్ వేయించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వార్డు మెంబర్ కాశీనాథ్ యాదవ్ ఏరియా కమిటీ మెంబర్ షౌకత్ అలీ మున్నా, బాలస్వామి, మల్లేష్, షకీల్ మున్నా, మధులత, యాదగిరి, బిక్షపతి ఫారుక్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

News 9

Related post