నిరాడంబరంగా విక్రమ్ దేవ్ వర్మ 151 వ జయంతి

 నిరాడంబరంగా విక్రమ్ దేవ్ వర్మ 151 వ జయంతి

ఆంధ్ర విశ్వవిద్యాలయం అభివృద్ధికి దోహద పడిన జైపూర్ సంస్థాన్ మహారాజా విక్రం దేవ్ వర్మ 151 వ జయంతి ఏయూలో నిరాడంబరంగా నిర్వహించారు.ఏయు అవుట్ గేట్ ఎదురుగా గల ఫిజిక్స్ విభాగంలో ఉన్న ఆయన విగ్రహం వద్ద ఆదివారం జయంతి వేడుకలు జరిగాయి. విక్రందేవ్ వర్మ మనమడు విభూతి భూషణ్ దేవ్ భార్య మహారాణి సారికా దేవి,ఇతర బంధుమిత్రులు జయంతి కార్యక్రమంలో పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహారాణి సారిక దేవి గారు మాట్లాడుతూ ఉన్నత విద్యా వ్యాప్తి ఆయన ఎంతో కృషి చేశారన్నారు. విశ్వవిద్యాలయానికి భూమిని దానం చేసి అవసరమైన భవనాల నిర్మాణం కూడా సహాయం అందించారు అన్నారు. మహారాజా విక్రమ్ దేవ్ వర్మ గారి ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్రాంతి పిక్చర్స్ అధినేత ఎన్ వి.రెడ్డి, న్యాయవాది వజ్జిపర్తి శ్రీనివాస్ ,కిషన్ తదితరులు పాల్గొన్నారు.

News 9

Related post