ఆదర్శనగర్ లో కోవిడ్ -19 విస్తృత పరీక్షలు

 ఆదర్శనగర్ లో కోవిడ్ -19 విస్తృత పరీక్షలు

విశాఖపట్నం: కోవిడ్ మహమ్మారి దేశం లో విజృభిస్తుండటం తో కేంద్ర ప్రభుత్వం అదేశాలకనుగుణం గా రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్-19 పరీక్షలు మరింత విస్తృతం చేశాయి… ఈ నేపధ్యం లో విశాఖపట్నం అర్బన్ లోని వివిధ వార్డుల్లో కరోన పరీక్షలను వైద్యులు నిర్వహిస్తున్నారు. 3 వ వార్డు ఆదర్శనగర్ లో ఆదివారం సుమారు 100 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించారు. ఆదర్శనగర్ లో ఓకే ఇంట్లో ఇటీవల పాజిటివ్ కేసులు నమోదు కావడం తో అప్రమత్తమైన అధికారులు చుట్టుపక్కల ఉన్న వారికి ముందు జాగ్రత్త కోవిడ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు అప్రమత్తంగా వుండాల0టు ఇప్పటికే ఙివిఎంసి అధికారులు హెచ్చరించడం తో బాటు, 60 ఏళ్ళు పైబడిన వారందరికీ కరోన పరీక్షలు నిర్వహించారు.ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఎవ్వరికీ ఎటువంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదు.తాజాగా ఆదివారం మరికొంత మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించారు.. ఆదర్శనగర్ ను కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించడం తో వ్యాపారస్తులు షాపులు తెరవడం లేదు.అలాగే అధికారుల సూచనలతో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇళ్లకే పరిమిత మయ్యారు.. కాగా ఆదివారం మరికొంత మందికి నిర్వహించిన టెస్టుల ఫలితాలు రావాల్సి ఉంది..

News 9

Related post