కాపుకార్పొరేషన్ నిధులు మల్లింపుపై శ్వేతపత్రం విడుదల చేయాలి….బండారు శ్రీనివాసరావు

 కాపుకార్పొరేషన్ నిధులు మల్లింపుపై శ్వేతపత్రం విడుదల చేయాలి….బండారు శ్రీనివాసరావు

కొత్తపేట \:కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ అధ్యక్షులు బండారు శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 2 రోజుల క్రితం కాపు కార్పొరేషన్ గురించి మాట్లాడుతూ ప్రభుత్వం నవరత్నాలు పేరుతో కార్పొరేషన్ నిధులు మళ్లించి కాపు నేస్తం అమ్మవడి రైతు భరోసా వాహనమిత్ర మొదలైన సంక్షేమ పథకాల నిధులు కేటాయించిన విధానం పై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరగా ప్రభుత్వం ఇప్పటిదాకా ఎటువంటి శ్వేతపత్రం విడుదల చేయకపోగా టిడిపి మరియు జనసేన కలిసి ప్రజలకు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలుకి ఓర్వలేక ప్రభుత్వం పై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారు అని అనడం చాలా బాధాకరంగా ఉంది అసలు మీరు నిజంగా ప్రజలకు సంక్షేమ పథకాలు లో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఉంటే మీకు ప్రవేశ పెట్టిన నవరత్నాలు పదకాలపై శ్వేతపత్రం విడుదల చేయడానికి ఇబ్బంది ఏంటి నిజంగా టిడిపి జనసేన కలిసి పోటీచేస్తే మీకు అన్ని సీట్లు వచ్చేవి కాదు క్రిందటి ఎన్నికలలో పవన్ కళ్యాణ్ టిడిపి కి సపోర్ట్ చేయడం వల్లే టిడిపి ప్రభుత్వం వచ్చింది అది గుర్తువుంచుకుని మాట్లాడండి జనసేన పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం ప్రవేశపెట్టే పధకాలు పై శ్వేతపత్రం విడుదల చేయాలని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ అధ్యక్షులు బండారు శ్రీనివాసరావు తెలిపారు.

News 9

Related post