హైదర్ నగర్ లో డ్రైనేజీ మ్యాన్ హోల్స్ నాసిరకంగానిర్మించడం వల్లతరచూ కూలిపోతున్నాయి

 హైదర్ నగర్ లో డ్రైనేజీ మ్యాన్ హోల్స్ నాసిరకంగానిర్మించడం వల్లతరచూ కూలిపోతున్నాయి

కూకట్పల్లి జూన్ 29: ప్రతి పది రోజులకు ఒకసారి హైదర్ నగర్ లో డ్రైనేజీలు పొంగుతున్నాయి ,అయితే ఇటీవల మూడు రోజుల కింద కూలిన మ్యాన్ హోల్స్ ని ఈరోజు వాటర్ వర్క్స్ మేనేజర్ తో కలిసి మునిసిపల్ వార్డ్ మెంబెర్ సిందం శ్రీకాంత్ పరిశీలించగా డ్రైనేజ్ లైన్ వేసి మ్యాన్ హోల్స్ నిర్మించే సమయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం జిహెచ్ఎంసి అధికారుల పర్యవేక్షణ లోపం వలన నాసిరకంగా పనులు జరిగినాయి అని గమనించారు , మ్యాన్ హోల్స్ నిర్మించే. సమయంలో లోపల ప్లాస్టింగ్ చేయకుండా వదిలేశారు అని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్ మీద బాధ్యతారహితంగా వ్యవహరించిన అధికారి మీద కమిషనర్కి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.డ్రైనేజీలు నిర్వహణ కొరకు డివిజన్ కమిటీ కి కేటాయించిన 20 శాతం నిధుల తో తక్షణమే అన్ని మాన్ హోల్స్ మరమ్మతులు చేపట్టాలని వార్డ్ కమిటీ చైర్మన్ జానకి రామరాజు ని భాగ్యనగర్ డివిజన్ మేనేజర్ వెంకటేశ్వరరావు ని కోరడం జరిగింది.

News 9

Related post