సమయనికి నీరు అందాలని డిమండ్

 సమయనికి నీరు అందాలని డిమండ్

తుర్పుగొదావరిజీల్లా 29-06-2020 జగ్గంపెట న్యుస్ :-పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టు రైతులకు సాగునీరు పూర్తిస్థాయిలో సమయానికి సక్రమంగా ఇవ్వాలని రైతులతో కలిసి పుష్కర అధికారులైన DEE లక్ష్మీనారాయణగారిని మరియు AE జగదీష్ గారిని జగ్గంపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇన్చార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు ఈ సందర్భంగా పాటంశెట్టి సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న అన్ని కాలువలు జంగిల్ క్లియరెన్స్ చేసి వెంటనే ఆయకట్టుకు సంబంధించిన చెరువులలో నీరు ముందుగానే నింపాలని అధికారులకు సూచించారు నిన్న ఆదివారం పురుషోత్తమపట్నం వద్ద గోదావరి వద్ద ఉన్న మెయిన్ పుష్కర పంపుహౌస్ లు పరిశీలించామని, ఈనెల 23వ తేదీన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఉన్నత అధికారులు పుష్కర ప్రారంభించారని అక్కడ ఉన్న 8 మోటార్లకు గాను 2 మోటార్ల ద్వారానే నీటిని విడుదల చేస్తున్నారని ఇప్పటి వరకు వర్షాలు లేక చెరువులు ఎండిపోయి ఉన్నాయని రైతులు పూర్తిగా పుష్కర నీటి మీదే ఆధారపడి ఉన్నారని కాబట్టి అధికారులు వెంటనే పుష్కర మెయిన్ పేజ్ 1, పేజ్ 2 పంపు హౌస్ లో ఉన్న 8 మోటార్లతో నీరు విడుదల చేయాలని అలా చేస్తేనే పుష్కర ఆయకట్టుకు నీరు పూర్తిస్థాయిలో అందుతుందని తెలిపారు పుష్కర నీరు 4 నెలలు విడుదల చేస్తారని మిగిలిన 8 నెలల్లో కాలువలు శుభ్రం చేయుట, పంపు హౌస్ దగ్గర మోటార్లు రిపేర్ చేసుకుణుట చెయ్యాలని ఆ విధంగా చేయనందువల్లనే నేడు పుష్కర మెయిన్, సబ్ కెనాల్స్ తుప్పలు దొంకలతో నిండిపోయి నీరు ప్రవాహానికి ఆటంకం కలిగి కాలువ గట్లు గండి కొట్టే పరిస్థితి ఉంటుందని అధికారులు ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం పుష్కర రైతాంగానికి శాపంగా మారుతుందని తెలిపారు ఉదాహరణకు తిరుమలాయపాలెం గ్రామంలో ఉన్న జగన్నాథ చెరువులోకి నీరు గత ఐదు సంవత్సరాల నుండి పూర్తిస్థాయిలో వెళ్లడంలేదని నష్టాల ఊబిలో కూరుకుపోయి అప్పుల పాలయ్యామని రైతులు తెలిపారు అదే రకంగా చాలా గ్రామాలలో రైతులు పూర్తిగా నీరందక పొలాలు ఎండిపోయి నష్టాల పాలవుతున్నారని పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు… ఈ కార్యక్రమంలో కోడి శ్రీనివాస్, బోనం వెంకటేశ్వర్లు, చెన్నంశెట్టి చక్రరావు, డి ఎం ప్రసాద్, చింతల పురుషోత్తమరావు, ఇనుకొండ రాజా, దాకారపు వీరన్న,నీలం వెంకట్రావు, కరణం గోవిందు, కోడూరు నాగేశ్వరరావు, ఎర్ర సాయిబాబు, తదితర రైతులు పాల్గొన్నారు నమస్సులతో… పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జ్.

News 9

Related post