ఏఐసీసీ పిలుపు మేరకు పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను నిరసిస్తూ ధర్నా

 ఏఐసీసీ పిలుపు మేరకు పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను నిరసిస్తూ ధర్నా

ఏఐసీసీ పిలుపు మేరకు పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను నిరసిస్తూ ఈరోజు ఉదయం 10:00లకు ఖమ్మం కలెక్టర్ కార్యాలయమునకు ఎదురుగా ధర్నా చౌక్ లో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమము జరిగినది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు సీఎల్పీ అధినేత మాట్లాడుతూ ,కరోనా కష్టకాలంలో తక్కువ మందితో సామాజిక దూరాన్ని పాటిస్తూ చేస్తున్న ఈ నిరసన అందరు సామాన్య ప్రజల కొరకు అని ప్రస్తుత కేంద్ర బిజెపి ప్రభుత్వము పెట్రొల్ మరియు డీజిల్ ధరలను అధికంగా పెంచేసిందని,

యు.పి.ఏ. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 107.09, పెట్రోల్ ధర 71.4, డీజిల్ ధర 55.49 గాను వీటి పై ఎక్సైజ్ సుంకం పెట్రోల్ పై 9.2 మరియు డీజిల్ పై 3.4 ఉండేదని.

ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 42.4, పెట్రోల్ ధర 79.7, డీజిల్ ధర 79.88 గాను వీటి పై ఎక్సైజ్ సుంకం పెట్రోల్ పై 32.9% మరియు డీజిల్ పై 31.83% పెంచారని,

ఫలితంగా సామాన్య ప్రజల మీద అధిక భారం పడుతుందని పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి అని విచారం వ్యక్తం చేశారు. అనంతరం ఖమ్మం జిల్లా కలెక్టర్ వారికి మెమోరాండం ను అందించారు.

ఈ కార్యక్రమంలో,

డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు,
నగర కాంగ్రెస్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి జావేద్,
నగర కార్పొరేటర్ వడ్డెబోయిన నరసింహారావు, బాలగంగాధర్ తిలక్,
పీ. వీరభద్రం,
శీలం నర్సిరెడ్డి,
ఎర్ర బోలు శ్రీనివాస్,
వెంకట్రెడ్డి, బొందయ్య,
ఏ.ఉదయ్ కుమార్, శేఖర్గౌడ్, మద్దినేని నాగిరెడ్డి,
మామిడి వెంకన్న,
అంజయ్య, గంగరాజు యాదవ్, తలారి చంద్రప్రకాష్ శంకర్ నాయక్, నరసింహారెడ్డి లాల్సింగ్, రాధాకృష్ణ లింగాల శ్రీనివాస రావు,అంబటి వెంకటేష్,
నాగార్జున, ఎంపిటిసి వీరభద్రం,కే. గోవింద రావు రమేష్,
వసీమ్, బానోతు ప్రవీణ్ నాయక్ జెడ్ పి టి సి,
మద్దినేని రమేష్,
దాసరి పూర్ణ, యాసీన్, ఎస్కే. జహీర్, వసీం తదితర కాంగ్రెస్ ప్రముఖులు పాల్గొని జయప్రదం చేసినారు.

News 9

Related post