Headlines

చిత్తూరు జిల్లాలో ప్రారంభమైన కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక పరీక్షల ప్రక్రియను పరీక్షా కేంద్రాలలో తనిఖీ

చిత్తూరు జిల్లా :

చిత్తూరు జిల్లాలో ప్రారంభమైన కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక పరీక్షల ప్రక్రియను పరీక్షా కేంద్రాలలో తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి.

చిత్తూరు పట్టణం లోని పి.వి.కె.ఎన్. కాలేజి మరియు విజయం కాలేజీ కేంద్రాలను సందర్శించి అక్కడ పరీక్షల తీరును తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థుల సీటింగ్ , ఇతర సౌకర్యాల సమీక్షతో పాటు APSLRB నియమ నిబంధనల ప్రకారం పరీక్షలు ఎలా నిర్వహించాలో ఇన్విజిలేటర్లకు సూచనలు చేశారు. కాఫీయింగ్, తదితర అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా జరిగేలా పక్కాగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ.. చిత్తూరు పట్టణం లోని మొత్తం 33 కేంద్రాల్లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రిలిమినరి పరీక్షలు జరుగుతున్నాయని, పకడ్బంది భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ప్రతి సెంటర్ లో ఒక ఎస్.ఐ, సిబ్బంది మరియు బి.డి. టీం తో పకడ్బందీ గా భద్రతా ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణం లోని పరీక్ష కేంద్రాల్లో 452 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది తో బందోబస్త్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి రెండు సెంటర్లకు సి.ఐ స్థాయిలో, ప్రతి నాలుగు సెంటర్లకు డి.ఎస్.పి స్థాయిలో ఫ్లైయింగ్ స్క్వాడ్ లు ఏర్పాటు చేశామని ఎస్.పి తెలిపారు. ఎగ్జామ్స్ సెంటర్స్ వెలుపల 144 సెక్షన్ అమలులో పెట్టాం. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో అనుమానిత వ్యక్తులు ఉన్నట్లు తెలిస్తే వెంటనే అదుపులోకి తీసుకొని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాలలో జిరాక్స్ సెంటర్లు మూసేయించాం. ప్రశాంతంగా మరియు సజావుగా పరీక్షలు నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకున్నాం, మధ్యహ్నాం 1 గంటతో పరీక్షలు ముగిశాక ఆ పత్రాలు స్ట్రాంగు రూంలకు వెళ్లేంత వరకు పటిష్ట భద్రతా చర్యలు ఉంటాయని ఎస్పీ తెలిపారు.

12196 మంది అభ్యర్థులలో 11254 మంది హాజరవగా 942 మంది గైర్వహాజరు అయ్యారు.
వీరిలో పురుషులు 9719 మంది ఉండగా 9026 హాజరయ్యారు, 693 మంది గైరవ్హాజరు అవ్వగా మహిళా అభ్యర్థులు 2477 మంది లో 2228 హాజరయ్యారు, 249 మంది గైరవ్హాజరు అయ్యారు.