పూతలపట్టు నియోజకవర్గం లో ముందుగా బంగారు పాళ్యం మండలంలో మొగిలి వద్ద గో పూజ

చిత్తూరు జిల్లా

కుప్పం నుండి ఇచ్చాపురానికి బయలుదేరిన యువగళం పాదయాత్రలో భాగంగా ఎనిమిదో రోజు పూతలపట్టు నియోజకవర్గం లో ముందుగా బంగారు పాళ్యం మండలంలో మొగిలి వద్ద గో పూజ నిర్వహించి, అనంతరం మొగిలేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పాదయాత్ర ప్రారంభించారు. పూతలపట్టు నియోజవర్గానికి సంబంధించిన మహిళలు, నాయకులు, కార్యకర్తలు, ఘనంగా ఆహ్వానం పలికి ఆయనతో కలిసి పాదయాత్ర కొనసాగించారు. బలిజపల్లి వద్ద గ్రామస్తులు హారతులిచ్చి పూలమాలతో సత్కరించారు. అలాగే సెల్ఫీలు కూడా తీసుకున్నారు. శేషాపురం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నారా లోకేష్ పూలమాలవేసి తాత గారికి నివాళులు అర్పించారు, మహిళలు, ప్రజలను ఉద్దేశించి
2014లో లోటు బడ్జెట్ లో ఉన్నా కూడా మహిళలకు పసుపు కుంకుమ కింద 20 వేల కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని అన్నారు.
2019లో ఒక ఛాన్స్ అని మహిళలకు మోసం చేశారని 45 సంవత్సరాలకే పింఛన్లు ఇస్తామని మహిళలకు మోసం చేశారని ప్రసంగించి, అక్కడ నుంచి పాదయాత్ర ప్రారంభించారు.