డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నివాసం పైన దాడిని ఖండిస్తున్నా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి

 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నివాసం పైన దాడిని ఖండిస్తున్నా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నివాసం పైన దాడిని ఖండిస్తున్నా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆదోని.టౌన్ అధ్యక్షుడు మాదాసు జగన్నాథం గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రాం ముఖ్య అంశం ఏమనగా నిన్న ముంబైలో అంబేద్కర్ ఇంటి పైన జరిగిన దాడిని తీవ్రమైనదిగా దాడిగా పరిగణిస్తున్నాం. Dr. B. R. అంబేద్కర్ మీద అంటే యావత్ భారతదేశంలోనే దళిత బడుగు బలహీనవర్గాలు మైనారిటీలు మీద జరిగిన దాడిగా పరిగణిస్తున్నాం. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పైన దాన్ని ప్రేమించే వ్యక్తుల పైన ఈ దాడి జరిగిందని ప్రభుత్వాలు గుర్తించాలి. దాడి చేసిన వ్యక్తులను వారి వెనుక ఎవరు ఉన్నా ఆ వ్యక్తులను అరెస్టు చేయాలని కఠినమైన శిక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.దళితుల మీదనే కాకుండా రాజ్యాంగాన్ని ప్రేమించే ప్రజల పైన కూడా ఈ దాడి జరిగిందని తీవ్రంగా ఖండిస్తూ, ముష్కరులను వెంటనే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన పరిణామంగా గమనించి కఠినమైన శిక్షలు వేయాలని డిమాండ్ చేస్తున్నాం.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా Dr. రాజు మాదిగ గారు మాట్లాడుతూ దేశ ప్రజల మీదనే జరిగిన దాడిగా చింతిస్తున్నాం ,బాధపడుతున్నాము, ఆవేదన పడుతున్నాం.మా ఆవేదనను కేంద్ర ప్రభుత్వం గుర్తించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఈరన్న , పట్టణ నాయకులు మణికంఠ, విజయ రాజు మరియు మండల నాయకులు మాదిరే అరికలపా, B. లక్ష్మన్న మల్లయ్య గోవిందు వీరస్వామి రామకృష్ణ నర్సన్న గోపాలు అంజి మాదిగ విద్యార్థి సమైక్య పట్టణ నాయకులు నరసింహ తదితర నాయకులు పాల్గొన్నారు.

News 9

Related post