Headlines

స్పందనలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్

చిత్తూరు జిల్లా

స్పందనలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ పేర్కొన్నారు.

చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్, జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, డి.ఆర్.ఓ ఎన్. రాజశేఖర్ లతో కలసి జిల్లా నలుమూలల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి 191 అర్జీలను స్వీకరించారు.

వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు జిల్లా కలెక్టర్, జెసి, డి.ఆర్.ఓ గారికి తమ వినతులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీక్షిస్తున్నారని, జిల్లా అధికారులు వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలుగైకొని పరిష్కరించాల్సిందిగా జిల్లా జాయింట్ కలెక్టర్, డి.ఆర్.ఓ లను మరియు జిల్లా అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో
వివిధ శాఖలకు సంబందించిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.