Headlines

ఢిల్లీలో బీఆర్‌ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఢిల్లీలోని వసంత్ విహార్‌లోనూతనంగా నిర్మించిన బిఆర్ఎస్ భవన్‌ను గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేసింది.

 

ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ. ”తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ప్రారంభమైన టిఆర్ఎస్ పార్టీ అనేక రాజకీయ ఒడిదుడుకులను తట్టుకొని, ప్రతి ఒక్క పౌరుడి మద్దతుతో లక్ష్యాన్ని సాధించింది. సీఎం కేసీఆర్ నిబద్ధతను మెచ్చి ప్రత్యేక తెలంగాణకు 39 రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. సీఎం కేసీఆర్ రాజనీతిజ్ఞతతో ఏర్పడిన తెలంగాణ ఈరోజు అభివృద్ధిలో దూసుకెళ్తుంది. 9 మంది లోక్‌సభ ఎంపీలతో, ఏడుగురు రాజ్యసభ ఎంపీలతో, 105 మంది ఎమ్మెల్యేలతో టీఆర్ఎస్ పార్టీ జాతీయస్థాయిలో కీలక పార్టీగా ఎదిగింది. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం ప్రతి ఒక్క గులాబీ సైనికుడికి గర్వకారణం. సీఎం కేసీఆర్ దూరదృష్టి, పట్టుదల, నిబద్ధత బీఆర్ఎస్ పార్టీని ఉన్నత స్థానానికి తీసుకెళ్లాయి” అంటూ కవిత ట్వీట్ చేశారు.

ఇక భవనం ప్రారంభోత్సవానికి ముందు అక్కడ నిర్వహించిన సుదర్శన పూజ, హోమం, వాస్తు పూజల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఆ తర్వాత భవన్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు కెసిఆర్. అనంతరం మ. 1:05 గంటలకు రిబ్బన్ కట్ చేసి భవన్‌లోకి ప్రవేశించారు