ప్రధాని మోడీ తో భేటీ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ

 ప్రధాని మోడీ తో  భేటీ  తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ

తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.  భేటీ అనంతరం  ప్రధానంగా నాలుగు అంశాలను మోదీకి వివరించినట్లుగా భేటీ అనంతరం కోమటిరెడ్డి వెల్లడి చేసారు . ఈ మేరకు ప్రధానికి వినతి పత్రాలు అందించినట్లుగా కూడా చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న ఫార్మా సిటీకి పర్యావరణ అనుమతులు నిలిపివేయాలని ప్రధానిని కోరినట్లుగా వెల్లడించారు.మొదట 3 వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తారని తొలుత అనుకున్న ఫార్మా సిటీని 19,333 ఎకరాలకు పెంచారని, దాని వల్ల హైదరాబాద్ నగరంపై కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంటుందని కోమటిరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొత్త గూడెం వరకు జాతీయ రహదారి చేయాలని, దీనికి నంబరు కూడా కేటాయించాలని కోరినట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని మూసీనది శుద్ధి కోసం రూ.3 వేల కోట్లు కేటాయించాలని, ఒక నీటి శుద్ధి ప్లాంటును కూడా ఏర్పాటు చేసేలా చూడాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. గంగా నది ప్రక్షాళన కోసం కేంద్రం చేపట్టిన ‘నమామి గంగే’ కార్యక్రమం తరహాలో మూసీ నదిని కూడా ప్రక్షాళన చేయాలని సూచించానన్నారు.అంతేకాక, నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా తన నియోజకవర్గమైన భువనగిరిలో రూ.1,045 కోట్లతో బ్లాక్‌ స్థాయి చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేయాలని కోరానని చెప్పారు. హౌసింగ్ పథకాన్ని కేంద్రమే చేపట్టాలని ప్రధానిని కోరినట్టు ఎంపీ అన్నారు. తన విజ్ఞప్తులకు ప్రధాని సానుకూలంగా స్పందించారని చెప్పారు.

News 9

Related post