గాలి, ప్లాస్టిక్, ఇతర వస్తువుల ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందని వెల్లడి చేసిన శాస్త్రవేత్తలు

 గాలి, ప్లాస్టిక్, ఇతర వస్తువుల ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందని వెల్లడి చేసిన శాస్త్రవేత్తలు

 ప్రపంచ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న కరోనా వైరస్ గురించి శాస్త్రవేత్తలు పలు కీలక విషయాలు వెల్లడించారు. తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో కరోనా వైరస్ గాలి, ప్లాస్టిక్ ద్వారా కూడా వ్యాపిస్తుందని తెలిసింది . కరోనా వైరస్ గాలిలో 3 గంటలు, రాగి సంబంధిత వస్తువులపై 4 గంటలు, అట్టపెట్టెలపై 24 గంటలు, ప్లాస్టిక్, స్టెయిన్ లెస్ స్టీల్ పై 2-3 రోజులు సజీవంగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. కాబట్టి మార్కెట్ లో కొత్తగా వచ్చిన ప్లాస్టిక్, స్టెయిన్ లెస్ స్టీల్ వస్తువులను కొంతకాలం పాటు వాడకుండా ఉండటం ఆరోగ్యానికి మేలు అని సూచిస్తున్నారు. ఇదే కరోనా వైరస్ ని పోలిన మరో వైరస్ సార్స్  2002-03 మధ్యలో విజృంభణకు కారణమైన సూక్ష్మజీవికి ఉన్న సామర్థ్యం ఇప్పుడు కరోనా వైరస్ లో కూడా ఉందని చెబుతున్నారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులతో కూడిన బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.

(కరోనా వైరస్ సమాచారం కోసం 104 కి కాల్ చేయండి . పై వివరణ కేవలం ప్రజలలో అవగాహన పొంపొందించుకోడానికి మాత్రమే , వీటి పూర్తి వివరాలు ప్రభుత్వ . WHO  అధికారిక వెబ్సైట్లలో తెలుసుకోండి .)

News 9

Related post