టాలీవుడ్‌ దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి కరోనాపై పాట..

 టాలీవుడ్‌ దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి కరోనాపై పాట..

అటు ప్రభుత్వాలకు ఇటు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా-19. ఈ మహమ్మారిపై పోరాటంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక మంది సెలబ్రెటీలు అండగా నిలుస్తున్నారు. పలువురు ఆర్థిక సహాయం చేస్తుండగా మరికొందరు ఈ వైరస్‌పై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేలా పలు వినూత్న ప్రయత్నాలకు తెరదీస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్‌పై చౌరస్తా బ్యాండ్‌, సంగీత దర్శకుడు కోటి  అందించిన పాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్‌ దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి ‘వి విల్‌ స్టే ఎట్‌ హోమ్‌.. వి స్టే సేఫ్‌’ అనే పాటను స్వయంగా రాసి, ట్యూన్‌ చేసి ఆలపించారు.

Author News9

Related post