అన్నా డీఎంకే నేత పళని కి కరోనా పాజిటివ్..

 అన్నా డీఎంకే నేత పళని కి కరోనా పాజిటివ్..

చెన్నై: తమిళనాడు అధికార అన్నా డీఎంకే పార్టీ కి చెందిన ఎమ్మెల్యే కె. పళని కి కరోనా పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు.

శ్రీ పెరుంబదూర్ నుంచి శాసన సభ కు ప్రాతినిధ్య వహిస్తున్న ఆయన.. ప్రస్తుతం చెన్నై లోని ఎంఐఓటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు అధికారులు వెల్లడించారు.

57 ఏళ్ల పళని శుక్రవారం రాత్రే ఆస్పత్రి లో చేరారనీ.. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడ గానే ఉందని అధికారులు తెలిపారు.

పళని కొవిడ్-19 బారిన పడడంతో తమిళ నాట ఈ వైరస్ బారిన పడిన ఎమ్మెల్యే ల సంఖ్య 2 కు చేరింది.

ఇటీవల కొవిడ్‌-19 కారణంగా డీఎంకే ఎమ్మెల్యే జె. అన్బళగన్ మృతి చెందిన సంగతి తెలిసిందే.

ఆయన చెన్నై లోని చెపాక్ – ట్రిప్లికేన్ నియోజకవర్గం నుంచి శాసన సభ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

News 9

Related post