Headlines

భీమడోలు బీజేపీ పార్టీ కార్యాలయంలో మండలం పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ పటేల్ కుమార్ ఆధ్వర్యంలో మండలం సమైఖ్య సమావేశం

: ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గము భీమడోలు మండలము భీమడోలు బీజేపీ పార్టీ కార్యాలయంలో మండలం పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ పటేల్ కుమార్ ఆధ్వర్యంలో మండలం సమైఖ్య సమావేశం జరిగింది! ఈ కార్యక్రమానికి ముఖ్య అధ్యక్షులుగా ఏలూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు కొర్ల జ్యోతి సుధాకర కృష్ణ హాజరయ్యారు!ఈ సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం వైసీపీ పాలనలో జరుగుతున్న రాజకీయ పరిణామాల విషయంలో బీజేపీ పార్టీ అసంతృప్తితో ఉన్నదని,రోడ్డుషోలు మీద వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన స్టే ఆర్డర్ విషయంలో బీజేపీ పార్టీ ఖండిస్తుందని హెచ్చరించారు! రానున్న ఎలక్షన్ లో అవసరమయితే జనసేనపార్టీతో పొత్తు పెట్టుకుని జిల్లాలో ఉన్న ప్రతీ నియోజకవర్గములో పోటీచేసి తీరుతామని హెచ్చరించారు! ఈ కార్యక్రమములో జిల్లా ఉపాధ్యషురాలు శ్రీమతి శరణాల మాలతీ రాణి, జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు మత్తి శ్రీనివాస్ శాస్త్రి, జిల్లా మోర్చా జనరల్ సెక్రటరీ శ్రీమతి మామిడిపల్లి కృష్ణ కుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.లక్ష్మి కృష్ణ ప్రసాద్, మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు మిద్దే వెంకట రామలక్ష్మి, మండల ప్రధాన కార్యదర్శి పడాల గౌరి శంకర్ రెడ్డి, బీజేపీ కార్యకర్తలు సత్తి సుశీలా రాణి, గుండ్రు గంగరాజు విజయ తదితరులు పాల్గొన్నారు!