Headlines

కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యులుగా ఎంపికైన అమలాపురం ఎంపీ శ్రీమతి చింతా అనురాధ గారు..

కేంద్ర ప్రభుత్వం గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారిని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యులుగా ఎంపిక చేసింది. ఈ మేరకు భారత ప్రభుత్వం నుండి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి

 

ఈ సందర్భంగా ఎంపీ చింతా అనురాధ గారు కేంద్ర ప్రభుత్వానికి మరియు ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

 

తాను ఇప్పటికే కేంద్ర కోకోనట్ బోర్డు మెంబర్ గా, కేంద్ర పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీ మెంబర్ మరియు టెలికాం అడ్వైసరి కమిటీ మెంబర్ గా సేవలు అందిస్తున్నట్లుగా ఎంపీ గారు చెప్పారు. ఈ కొత్త పదవి ద్వారా వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీకి సంబంధించి ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేస్తానని ఎంపీ శ్రీమతి చింతా అనురాధ గారు పేర్కొన్నారు