Headlines

151 వ రోజుకు చేరిన అన్న క్యాంటీన్.

 

కదిరి. జనసేన ప్రతినిధి. ఆగస్టు 24.

కదిరిలో అన్నా క్యాంటీన్ 151 వ రోజుకు చేరింది. ఈ క్యాంటీన్ కొనసాగిస్తున్న వ్యక్తి బంగారు కృష్ణమూర్తి. యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు నారా లోకేష్ బాబు ప్రారంభించారు. అప్పటినుండి ఇప్పటివరకు ఐదు రూపాయలకే భోజనం సదుపాయం కల్పిస్తున్నారు. ఈ అన్నా క్యాంటీన్లో ఒక రోజుకి 200 నుండి 500 వరకు జనాభా భోజనం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా బంగారు కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రజల ఆకలి తీర్చడమే నా ధ్యేయము నా కర్తవ్యం నేను పేద ప్రజల కోసమే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. పేద ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలన్నదే నా ధ్యేయమన్నారు. దానం కెల్లా అన్నదానం గొప్పదంటారు. అందుకని ఏ పేదవాడు ఆకలి అని పరితపించే పరిస్థితి రాకూడదని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. భోజనం సందర్భంగా పలుగురు ప్రజలను అడగగా బంగారు కృష్ణమూర్తి చేస్తున్న పని కడుపు నింపడం చాలా సంతోషకరమని వారు చెప్పడం జరిగింది. పలుకురు ప్రజలు వంద సంవత్సరాలు చల్లగా ఉండాలని దీవెనలు అందించడం జరిగింది. ఎల్లవేళలా పిల్లాపాపలతో పేదవాడి కడుపు నింపుతూ నిత్యం ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లో తీసివేసిన అన్నం నేను పెడతానని ముందుకు వచ్చిన మహానుభావుడు బంగారు కృష్ణమూర్తి. మధ్యాహ్నం ఒంటి గంట అయ్యిందంటే కదిరి పట్టణంలో బంగారు కృష్ణమూర్తి గుర్తుకొస్తాడు,ఎందుకంటే ఆయన పేదవాడు కడుపు నింపుతాడు కాబట్టి. ఇంత మంచి వ్యక్తి మా కదిరి పట్టణము లో ఉన్నందున మాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఒంట్లో శక్తి ఉన్నంతవరకు అన్నా క్యాంటీన్ కొనసాగిస్తానని బంగారు కృష్ణమూర్తి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు మీడియా మిత్రులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ విషయంపై బంగార కృష్ణమూర్తి మీ దీవెనలు ఎల్లప్పుడూ నాకు ఉండాలని కోరుకున్నారు.