యాడికి మండల ప్రజలకు వినాయక చవితి పండుగ సందర్భంగా పందిరి/మండపాలు ఏర్పాటు చేసుకోదలచిన వారు యాడికి పోలీస్ స్టేషన్ నందు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.
వినాయక చవితి సందర్భంగా మండపం వద్ద పాటించ వలసిన నియమ నిబంధనలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1. పోలీస్ స్టేషన్ లో అనుమతి తప్పని సరిగా తీసుకోవాలి.
2.5 లేదా ఎక్కువ మంది కమిటీ గా ఏర్పడి వారి యొక్క వివరాలు సంబంధిత పోలీస్ స్టేషన్ లో వివరాలు తెలపాలి
3. సంబంధిత పంచాయతీ సెక్రెటరీ, ఫైర్ మరియు విద్యుత్ శాఖ వారి అనుమతి పొందాలి . మండపం లో దీపారాధన వలన అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త తీసుకోవాలి
4.లౌడ్ స్పీకర్ లను ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉపయోగించాలి.
5.ఊరేగింపు సమయంలో ఇతర కులాలు, మతాలకు వ్యతిరేకంగా నినాదాలు చేయరాదు. నిమర్జన ఊరేగింపుకు అనుమతించిన సమయం, నిమర్జన కు కేటాయించిన ప్రదేశం మరియు ఊరేగింపునకు కేటాయించిన మార్గము లాంటి నిబంధనలు ఖచ్చితంగా పాటించవలెను.
నిమజ్జనానికి వెళ్లే వాహనం పై మద్యం లేదా మత్తు పదార్ధాలను సేవించిన వారు మరియు మైనర్ లు ఉండరాదు .
6.విగ్రహం ఏర్పాటు చేసిన నిర్వాహకులే తగిన భద్రతా ఏర్పాట్లు చూసుకోవాలి రాత్రిళ్లు మండపం వద్ద ఉండాలి.
ఎస్సై యాడికి పియస్.