పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 26 :
స్థానిక శశి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్థులకు శారీరిక, వ్రాత పరీక్ష మరియు భౌతిక పరీక్షలు నిర్వహించి ఎన్ సి సి శిక్షణకు ఎంపిక చేసినట్లు 19 ఆంధ్ర బెటాలియన్ నాయబ్ సుబేదార్ దేవేందర్ సింగ్, కుల్విందర్ సింగ్ తెలియజేశారు. ఈ ఎంపిక పరీక్షలు కళాశాల ఎన్ సి సి అధికారి లెఫ్టినెంట్ పి.ఎస్ శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కళాశాల వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ మాట్లాడుతూ ఎన్ సి సి లో చేరడం వల్ల సేవాస్పూర్తి, క్రమశిక్షణ, ఐక్యమత్య భావన ,దేశభక్తి కలుగుతుందన్నారు. ఎంపికైన వారిని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎండి ఇస్మాయిల్ డీన్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ సుబ్రహ్మణ్యం మరియు వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు అభినందించారు.