యాడికి,మండలమును కరువుమండలముగా ప్రకటించి,నష్టపోయిన ప్రతిరైతుకుపంటలవారిగా నష్టపరిహరము అందించాలని ఏపిరైతుసంఘము తాడిపత్రి నీయోజకవర్గసమితి అద్వర్యంలో యాడికి మండలకేంద్రములో విలేకరుల సమావేశములో
జిల్లారైతు సంఘం ఉపాధ్యక్షులు వెంకటరాముడు యాదవ్, తాడిపత్రి రైతు సంఘము నీయోజకవర్గ కార్యదర్శి ఓబిరెడ్డి, మాట్లాడుతూ,
యాడికి మండల వ్యాప్తంగా ఖరీఫ్ యందు వేరుశనగ, పత్తి, ఆముదం, కంది ,జొన్న, సద్ద, కొర్ర .అనేకమైన వాణిజ్య ఆహార పంటలు జూన్ నెలాఖరు నుండి సాగు చేయడం జరిగినది కానీ సకాలంలో వర్షాలు లేక పంటలన్నీ పిందె పూత ఊడల దశ లోనే పంటలన్నీ ఏండిపోవడం జరిగినదిరబీలోకూడ రైతులుఅష్టకష్టాలు పడుతున్నారుఅందువలన రైతులు కౌలు రైతులు పెట్టిన పంటలన్నీ నష్టపోవడం జరిగినది ఇప్పటికే పంటలవారిగా ఎకరాకి 30 వేలపైగా ఖర్చు పంటలకు పెట్టి నష్టపోవడం జరిగినది కావున ప్రతి సంవత్సరం అధిక వర్షాల వల్ల ,అకాల వర్షాల వలన, అనావృష్టి వలన నష్టపోవడం జరుగుతున్నది కానీ ప్రభుత్వం నుంచి రైతులకు ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదు ఈ సంవత్సరం అనావృష్టి వలన దాదాపుగా వేల ఎకరాల్లో వేసినఅన్ని రకాల పంటలు నష్టపోవడం జరిగింది కావున వాతావరణ బీమాను రద్దుచేసి, గ్రామాల యూనిట్ ఆధారంగా పంటల బీమాపథకాన్ని వర్తింపచేయాలి, తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించి నష్ట పరిహారం నివేదికలు తయారు చేసి జిల్లా యంత్రాంగానికి పంపి నష్టపరిహరము,పంటల బీమా వచ్చే విధంగా కృషి చేయాలని ఈ క్రింది డిమాండ్లు ను తక్షణమే అమలు చేయాలి.
డిమాండ్లు!
1)యాడికిమండలమును కరువుమండలముగా ప్రకటించాలి.
2)నష్టపోయినప్రతిరైతుకుపంటలవారిగా పంటనష్టపరిహరము అందించాలి.
3)రైతులుతీసుకున్నఋణాలుఅన్ని రద్దుచేసి తిరిగి క్రోత్తఋణాలుఇవ్వాలి.
4)రైతులకు ఉచితంగా పశుగ్రాసము పంఫీణీ చేయాలి.
5)జాతీయవిపత్తులనిర్వణక్రిందకేటాయిస్తామన్న4000కోట్లు కేటాయించాలి.
6) మద్దతు ధరల స్థిరీకరణ నిధి 3000 కోట్ల రూపాయలు కేటాయించాలి.
7)విత్తనాలు, ఎరువులు పురుగుమందులు 90% సబ్సిడీతో రైతులకు అందించాలి.
8) 50 సంవత్సరాల నుండి ప్రతి రైతుకు 10,000 నెలకు పెన్షన్ ఇవ్వాలి.
9)మిరప రైతులకు ఎకరాకు50వేలు రూపాయలు నష్టపరిహరము అందించాలి .
పాల్గొన్నవారు ,సిపిఐ మండలసహయకార్యదర్శి రాముడు,శివన్న,బాలానాయుడు,వెంకటరామిరెడ్డి, రైతులుపాల్గోనడమైనది.