ప్రతీ విద్యార్ధి ఓటు హక్కు నమోదు చేసుకోవాలి..

 

 

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, నవంబర్ 21:

 

అర్హత గల ప్రతీ విద్యార్ధి ఓటరుగా నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆర్డిఓ చెన్నయ్య సూచించారు. మంగళవారం పెదతాడేపల్లిలోని వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు ఓటు నమోదు, వినియోగం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ చెన్నయ్య మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ప్రతీ నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణాల్లో ఓటరు నమోదు ప్రక్రియ సిస్టమేటిక్ ఎలక్టోరల్ ఇన్యుమురేషన్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో ఓటు హక్కు నమోదు చేసుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఎన్నికల ప్రక్రియ జరిగిన తీరు, ప్రస్తుతం జరుగున్న తీరు గురించి విద్యార్థులకు వివరించారు. స్వాతంత్య్ర యోధులు తమ ప్రాణాలను పణ్ణంగా పెట్టి స్వతంత్ర్యాన్ని సాధించారని అన్నారు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజా స్వామ్యమైన భారత దేశంలో రాజ్యాంగం అందరికీ కల్పించిన స్వేచ్ఛ, స్వాతంత్ర్యయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దానిలో ముఖ్యంగా ఓటు హక్కు ప్రధానమైనదని అన్నారు. ఓటు హక్కు నమోదు, వినియోగంలో యువత ముందుండాలని సూచించారు. 2024 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. దేశ భవిష్యత్తు భావి భారత పౌరుల చేతిలో ఉందని అన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువతేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నోడల్ అధికారి ఎంపిడివో విశ్వనాధం, ఎలక్షన్ డి.టి. ప్రసాద్, కళాశాల పాలకవర్గ అధ్యక్ష కార్యదర్శులు గ్రంధి సత్యనారాయణ, చలంచర్ల సుబ్బారావు, విఆర్ ఓ పోతురాజు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.